Straberry: ఇలాంటి స్ట్రాబెర్రీని ఎప్పుడూ చూసి ఉండరు… ఏకంగా గిన్నిస్ బుక్ ఎక్కేసింది.. వీడియో
స్ట్రాబెర్రీ ఫ్రూట్ గురించి తెలియని వారుండరు. అందమైన హృదయాకారంలో ఉండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెబుతారు. ఈ పండు పుట్టింది ఉత్తర అమెరికాలోనే అయినా ప్రపంచవ్యాప్తంగా సాగులోకి వచ్చింది. అయితే ఈ స్ట్రాబెర్రీ ఇప్పడు ప్రపంచ రికార్డుకెక్కంది. వివరాల్లోకి వెళ్తే...
World Record Straberry : స్ట్రాబెర్రీ ఫ్రూట్ గురించి తెలియని వారుండరు. అందమైన హృదయాకారంలో ఉండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెబుతారు. ఈ పండు పుట్టింది ఉత్తర అమెరికాలోనే అయినా ప్రపంచవ్యాప్తంగా సాగులోకి వచ్చింది. అయితే ఈ స్ట్రాబెర్రీ ఇప్పడు ప్రపంచ రికార్డుకెక్కంది. వివరాల్లోకి వెళ్తే…ఇజ్రాయెల్‌కు చెందిన ఏరియల్ చాహి అనే వ్యక్తి తన పొలంలో 289 గ్రాముల బరువున్న భారీ స్ట్రాబెర్రీని పండించారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా అవతరించింది. 18 సెం.మీ పొడవు, 4 సెం.మీ మందంతో ఉన్న ఈ భారీ స్ట్రాబెర్రీ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. సాధారణంగా స్ట్రాబెర్రీలు చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. బరువు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఇలాన్ రకానికి చెందిన ఈ స్ట్రాబెర్రీని ‘స్ట్రాబెర్రీ ఇన్ ది ఫీల్డ్’ ద్వారా పెంచారు. నిజానికి, స్ట్రాబెర్రీలను పండించడం ఏరియల్ కుటుంబ వ్యాపారం. దీనికి సంబంధించిన వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. స్ట్రాబెర్రీలను తూకం వేయడానికి ముందు వాటిని పరీక్షించడానికి ఒక ఐఫోన్‌ను తూకం వేశారు. ఆ తరువాత స్ట్రాబెర్రీలను తూకం వేశారు. బరువును పరిశీలిస్తే, ఐఫోన్ కంటే స్ట్రాబెర్రీ బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ స్ట్రాబెర్రీ అనే బిరుదును పొందింది. అంతకుముందు, ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా 2015 సంవత్సరంలో రికార్డు నమోదైంది. ఇది 250 గ్రాముల బరువు ఉంటుంది. దీనిని జపాన్‌కు చెందిన కోజీ నకావో పెంచారు. ఈ జపనీస్ రకం స్ట్రాబెర్రీని అమావు అంటారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

