World’s oldest Cake: వందల ఏళ్లనాటి కేకు.. ఇంకా తాజాగానే ఇంగ్లండ్‌లో తవ్వకాల్లో గుర్తించిన అధికారులు.. (వీడియో)

|

Nov 15, 2021 | 9:51 AM

పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడటం మనం చూస్తుంటాం.. కానీ, తాజాగా ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసిన ఓ కేకు తవ్వకాల్లో బయటపడటం, అది ఇంకా తాజాగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు....


పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడటం మనం చూస్తుంటాం.. కానీ, తాజాగా ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసిన ఓ కేకు తవ్వకాల్లో బయటపడటం, అది ఇంకా తాజాగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు మహా అంటే ఓ వారం రోజులు నిల్వ వుంటాయి. కానీ ఇవాళ చేస్తే మర్నాడుకి పాడయిపోయే కేక్‌ ఏళ్ల తరబడి తాజాగా ఎలా ఉందో ఎవరికీ అంతు చిక్కడంలేదు. అది ఎక్కడో ఏంటో.. తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో దహనమైపోయిన ఓ ఇంట్లో ఈ కేకు బయట పడింది. దాని పక్కనే ఓ కత్తి, నాలుగు స్పూన్లు కూడా దొరికాయి. దాంతో ఆ ఇంట్లో ఏదో ఒక వేడుక విషాదంతంగా ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆ కేకు తాజాగా ఉండటమే కాదు.. దానిపై చాక్లెట్‌ చిప్స్‌తో చేసిన గార్నిషింగ్‌ చెక్కు చెదరకుండా ఉంది. ఆ ఇల్లు జోహాన్‌ వార్మ్‌ అనే వ్యక్తిదిగా గుర్తించారు పరిశోధకులు. అయితే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌లో వందలాది ఇళ్లు మంటల్లో దగ్ధమైపోయాయని, అందులో ఈ ఇల్లు కూడా ఒకటై ఉంటుందని పురావస్తు అధికారులు తెలిపారు. అయితే ఈ కేకులో ఎలాంటి రసాయనాలు గుర్తించలేదని తెలిపిన అధికారులు ఇంత కాలం తాజాగా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని చెప్పారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Follow us on