భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!

Updated on: Aug 10, 2025 | 7:57 PM

ఉరుములు, మెరుపులతో ఆగస్ట్‌ 4న హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో గచ్చిబౌలిలో పిడుగు పడింది. రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో మంటల్లో చెట్టు మాడి మసైంది. అక్కడే ఉన్న జనం భయపడి పరుగులు తీశారు. అయితే ప్రపంచంలోనే అతి పొడవైన పిడుగు 2017 అక్టోబర్ లో అమెరికాలో పడింది. 8 ఏళ్ల క్రితం నాటి ఆ మెరుపు తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యంత పొడవైన మెరుపుగా చరిత్రలోకి ఎక్కింది.

ఆ రోజున ఆకాశాన అత్యంత భారీ మెరుపు ఒకటి మెరిసింది. ఆ మెరుపు కారణంగా రాత్రి కూడా పగలులా మారిపోయింది. ఆకాశం తగలబడిపోయిందా అన్నంతగా భయపడ్డారు జనం. ఆ మెరుపు గురించి కథలు, కథలుగా చెప్పుకున్నారు. ఆ మెరుపు పొడవు అక్షరాలా 829 కిలోమీటర్లు. టెక్సాస్ నుంచి కాన్సాస్ వరకు ఆ మెరుపు వ్యాపించింది. గతంలో 61 కిలోమీటర్లుగా ఉన్న రికార్డును ఈ మెరుపు తిరగరాసింది. ది వరల్డ్ మిటియరాలజికల్ ఆర్గనైజేషన్ wMO తాజాగా పొడవైన మెరుపుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. శాస్త్రవేత్తలు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఆ మెరుపు పొడవును అంచనా వేశారు. మెరుపు మెరిసిన ఎనిమిదేళ్ల తర్వాత రికార్డ్‌ను కట్టబెట్టారు. దీనిపై జియోగ్రాఫికల్ సైంటిస్ట్ ర్యాండీ సెర్వెనీ మాట్లాడుతూ ఆ మెరుపుకు మెగాఫ్లాష్ లైట్నింగ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. 2020 ఏప్రిల్ లో కూడా అమెరికాలో ఓ భారీ మెరుపు మెరిసింది. ఆకాశంలో అడ్డంగా మెరిసిన ఆ మెరుపు పొడువు 768 కిలోమీటర్లు. అది టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి వరకు వ్యాపించింది.

మరిన్ని వీడియోల కోసం :

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే వీడియో

ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ వీడియో

మహాశివుని పాదాలను తాకిన గంగమ్మ కనువిందు చేస్తున్న దృశ్యాలు