రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే వీడియో
శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి.. కాలేయం దెబ్బతిన్నప్పుడు, అది మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. లివర్ దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా.. చికిత్స సులభం అవుతుంది.. లివర్ దెబ్బతిన్నప్పుడు.. లేదా దెబ్బతింటున్నప్పుడు.. ఈ లక్షణాలు ముఖ్యంగా రాత్రి సమయంలో కనిపిస్తాయి. ఈ లక్షణాలను విస్మరించడం వల్ల మీ కాలేయం మరింత ప్రభావితమై.. అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా లివర్ దెబ్బతినడానికి సంకేతం కావచ్చు.
చాలా మంది తరచుగా మూత్ర విసర్జన చేయడం మధుమేహానికి సంకేతంగా భావిస్తారు.. కానీ మధుమేహం కాకుండా, తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా లివర్ దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, దానిని విస్మరించకండి.. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి. కాలేయ సమస్యలు, ముఖ్యంగా లివర్ సిర్రోసిస్ విషయంలో రాత్రి నిద్రకు అంతరాయం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు పదేపదే అంతరాయం కలిగిస్తుంది లేదా నిద్రపోవడంలో ఇబ్బంది కలుగుతుంది.లివర్ దెబ్బతిన్నప్పుడు చర్మంపై దురద సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి లేదా సాయంత్రం చర్మం దురదగా ఉంటుంది.. అరచేతులు, పాదాలలో నిరంతరం దురద వస్తుంటే.. ఈ సమస్యను విస్మరించవద్దు. లివర్ సమస్యల వల్ల పాదాలలో వాపు సమస్య కూడా ఉండవచ్చు. రాత్రి నిద్రపోతున్నప్పుడు పాదాల వాపు లాంటివి కనిపిస్తే.. ఈ సమస్యను విస్మరించవద్దు, వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి. లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స పొందడం ద్వారా, లివర్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం :
ఏకాంతం కోసం లాడ్జిలో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో
కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో
పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
