పెళ్లిపీటలెక్కబోతున్న ఇద్దరు లేడీ డాక్టర్స్‌..ఇదేం వైపరీత్యమో మరీ!(Video)

|

Jan 06, 2022 | 10:00 AM

ఇటీవల హైదరాబాద్‌లో గే మ్యారేజ్‌ అట్టహాసంగా జరిగింది. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి..

ఇటీవల హైదరాబాద్‌లో గే మ్యారేజ్‌ అట్టహాసంగా జరిగింది. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి..అయితే, కేవలం ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి..ఇప్పుడిప్పుడే మన దేశానికి కూడా పాకింది. తాజాగా ఇలాంటిదే మరో జంట వివాహం రచ్చ రేపుతోంది. ఇద్దరు లెస్బియన్లు పెళ్లి చేసుకోబోతోన్నారు. త్వరలో ఒక్కటి కాబోతోన్నారు. వారిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీరికి పెళ్లికి ఇరు కుటుంబీకులు అంగీకరించటంతో అందరి సమక్షంలోనే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన..