Snakes: కశ్మీర్ బంకర్లలో పాములు.. బంకర్లను ఊడ్చి శుభ్రం చేస్తున్న మహిళలు.. ఎందుకంటే.?
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూ దాడులకు పాల్పడుతుంది దీంతో ప్రజలు మళ్లీ బంకర్లను ఆశ్రయిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో కొన్నాళ్లుగా ఉపయోగంలో లేని బంకర్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ను నమ్మలేమని త్రేవా గ్రామ సర్పంచ్ బల్బీర్‌కౌర్ తెలిపారు. 2018 తర్వాత తమ గ్రామాలపై మోర్టార్ దాడులు జరిగాయని బంకర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో వాటిలో ఆశ్రయం పొందలేకపోయామని అన్నారు.
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూ దాడులకు పాల్పడుతుంది దీంతో ప్రజలు మళ్లీ బంకర్లను ఆశ్రయిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో కొన్నాళ్లుగా ఉపయోగంలో లేని బంకర్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ను నమ్మలేమని త్రేవా గ్రామ సర్పంచ్ బల్బీర్‌కౌర్ తెలిపారు. 2018 తర్వాత తమ గ్రామాలపై మోర్టార్ దాడులు జరిగాయని బంకర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో వాటిలో ఆశ్రయం పొందలేకపోయామని అన్నారు. స్థానికులంతా బంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. చాలా కాలంగా బంకర్లను పట్టించుకోకపోవడంతో చాలా వాటిలో నీరు నిలిచింది. కొన్నింటిలో చెట్లు మొలిచాయి. పాములు సైతం తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొన్నింటిలో విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల వంటి సదుపాయాలు లేకుండా పోయాయని వారు వాపోయారు. పాక్ కాల్పుల నుంచి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో 2017 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వం 14 వేల బంకర్లను నిర్మించింది. గురువారం ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఓ బీఎస్‌ఎఫ్ జవాన్, ఓ మహిళ గాయపడ్డారు. అంతేకాదు ప్రస్తుత సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో చాలా మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. గురువారం రాత్రి కాల్పులు మొదలుకాగానే వారు సురక్షిత ప్రాంతాల్లోకి చేరి తలదాచుకున్నారు. మరుసటి రోజు కాల్పులు ఆగాకే ఇళ్లకు బయల్దేరివెళ్లారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..