Woman overaction: నడి రోడ్డుపై మహిళ ఓవరాక్షన్.. రిక్షావాలాను చొక్కా పట్టుకుని నిమిషం గ్యాప్ లోనే 17 చెంపదెబ్బలు..
ఇటీవల కొందరు చిన్న ఘటనలకు సైతం ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. తమ వాహనాలకు అడ్డోచ్చారంటూ క్యాబ్ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను చితక బాదుతున్నారు. రోడ్లపైనే రచ్చ రచ్చ చేస్తూ అటు ట్రాఫిక్‌కు,
ఇటీవల కొందరు చిన్న ఘటనలకు సైతం ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. తమ వాహనాలకు అడ్డోచ్చారంటూ క్యాబ్ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను చితక బాదుతున్నారు. రోడ్లపైనే రచ్చ రచ్చ చేస్తూ అటు ట్రాఫిక్‌కు, ఇటు వాహన దారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ అమాయక రిక్షావాలాతో ఓ మహిళ విచక్షణా రహితంగా ప్రవర్తించింది. నోయిడాలో ఓ రిక్షా పొరపాటున ఓ కారుకు తగిలింది. అంతే కారు నడుపుతున్న మహిళ.. రిక్షా కార్మికుడి చొక్కా పట్టుకుని రోడ్డుపై అటూ ఇటూ తిప్పుడూ తిట్ల దండకం అందుకుంది. రిక్షావాలా చేతులు జోడించి క్షమాపణలు అడిగాడు. అయినా.. ఆ మహిళ కాస్తైనా కనికరం చూపలేదు. చొక్కా పట్టుకుని ఎడాపెడా చెంపదెబ్బలు వాయించింది. కేవలం 90 సెకన్లలో వ్యవధిలోనే 17 సార్లు రిక్షావాలాను లెంపకాయలు కొట్టిందంటే ఆ మహిళ ఎంత దారుణంగా ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
