Victoria Waterfalls: గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!

|

May 28, 2024 | 7:43 PM

ఫొటోలు, వీడియోల కోసం కొందరు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. 380 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న భారీ జలపాతం అంచున పడుకొని ఓ మహిళా టూరిస్ట్ జలకాలాడిన పాత వీడియో ఒకటి నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ యువతి జాంబియా–జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకొని కిందకు చూడటం కనిపించింది.

ఫొటోలు, వీడియోల కోసం కొందరు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. 380 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న భారీ జలపాతం అంచున పడుకొని ఓ మహిళా టూరిస్ట్ జలకాలాడిన పాత వీడియో ఒకటి నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ యువతి జాంబియా–జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకొని కిందకు చూడటం కనిపించింది. ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాల్లో విక్టోరియా ఫాల్స్ ఒకటి. ఆ సమయంలో జలపాతంలోని నీరు ఉద్ధృతంగా కిందకు ప్రవహిస్తోంది. ఎందరో టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న ఈ జలపాతాన్ని స్థానికులు డెవిల్స్ పూల్ గా చెబుతుంటారు. 380 అడుగుల జలపాతానికి ఇంత దగ్గరగా రావడం అనేది మామూలు విషయమే అని తెలుసుకున్నా’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ పోస్ట్ చేసింది. వీడియోను పోస్ట్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 3 కోట్ల వ్యూస్ లభించాయి. వీడియోను చూసిన నెటిజన్లంతా ఆ మహిళా పర్యాటకురాలిపై మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి పని అంటూ విమర్శిస్తున్నారు.

‘వామ్మో.. వీడియోను చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది’ అని ఓ యూజర్ స్పందించగా మరొకరేమో ‘నేను ఎప్పటికీ అలా చేయను’ అంటూ పేర్కొన్నారు. ఇంకొకరు స్పందిస్తూ ‘హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఫొటోల కోసం ఇలా జలపాతం అంచున నిలబడి ప్రవాహంలో కొట్టుకుపోయి ఎందరో మరణిస్తున్నట్లు తరచూ వింటుంటాను. పాకుడు రాళ్లపై జారిపోతూ పట్టు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రాణభయంతో వారు చూసే చూపును చూడాలని లేదా గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు’ అని కామెంట్ పెట్టారు. అయితే మరో యూజర్ మాత్రం ఆమె కాళ్లకు తాడు కట్టుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అందుకే ఆమె ధైర్యంగా కనిపిస్తోందని.. వీడియోలోనూ ఆమె కాళ్లను చూపించలేదని పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ వీడియో సుమారు రెండేళ్ల కిందటిది. ఏడాది కిందట ఓసారి వైరల్ అయింది. తాజాగా మరోసారి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆఫ్రికా ఖండంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా భావించే డేవిడ్ లివింగ్ స్టోన్ అనే యూరోపియన్ ఈ జలపాతానికి బ్రిటన్ రాణి విక్టోరియా పేరు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.