పెళ్లింట విషాదం.. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి
మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించిన ఓ యువతి కాసేటికే విగత జీవిగా మారింది. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.
మధ్యప్రదేశ్‌లో విదిష జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో స్టేజ్‌పై ఓ యువతి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వధువుకు చెల్లి అయిన ఆ యువతి హఠాన్మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఆ యువతి పరిణీత జైన్ ఇండోర్ నుంచి వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుకు గురికావడంతో ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నారు. యువతి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన దృశ్యాలు కెమరాలో రికార్డు కావడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

