త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
కొంతమంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడంతో పాటు వాళ్లు కూడా ఇబ్బందుల పాలవుతుంటారు. వాళ్లు చేసే పొరపాట్లు ఒక్కోసారి ప్రాణాలమీదికి తెస్తుంటాయి. రోడ్లపై వాహనాలు నడిపే కొందరికి అస్సలు ఓపిక అనేదే ఉండదు. ఆగమేఘాలపై వెళ్లాలని వేగంగా బైక్‌పై దూసుకెళ్తుంటారు.
ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, రైల్వే క్రాసింగ్ దగ్గర గేటు పడినా దాని కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళ బైక్‌పై కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడింది. దీంతో ఆమెతో పాటు చాలా మంది అక్కడే ఆగిపోయారు. కొందరు మాత్రం క్రాసింగ్ వద్ద గేటు వేసి ఉన్నా లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్నారు. వాళ్లను చూసి సదరు మహిళ కూడా త్వరగా ఇంటికి చేరుకోవాలని గేటును చేత్తో పైకెత్తి, బైక్‌ను ముందుకు పోనిచ్చింది. అయితే ఆ గేటు ఆమె వెనుక వైపునకు వెళ్లి ఉంటే మహిళ సేఫ్‌గా ముందుకు వెళ్లిపోయేది. కానీ బైక్ ముందుకు వెళ్లకముందే గేటు కిందకు వచ్చింది. దీంతో ఆమె బైక్ పై నుంచి వెనక్కి పడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ పెడుతుంది అంతే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

