Sun Rise on Moon: చంద్రుడిపై సూర్యోదయం.. రోవర్‌, ల్యాండర్‌ మేల్కొంటాయా..?

|

Sep 21, 2023 | 8:48 AM

చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారు ఆసక్తిగా చూస్తోంది. చంద్రుడిపై ప్రస్తుతం నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేల్కొని ప్రయోగాలు కొనసాగిస్తాయా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ వాటికి అప్పగించిన పనులు విజయవంతంగా పూర్తిచేశాయి. చంద్రుడికి సంబంధించి విలువైన సమాచారాన్ని అందించాయి.

చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారు ఆసక్తిగా చూస్తోంది. చంద్రుడిపై ప్రస్తుతం నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేల్కొని ప్రయోగాలు కొనసాగిస్తాయా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ వాటికి అప్పగించిన పనులు విజయవంతంగా పూర్తిచేశాయి. చంద్రుడికి సంబంధించి విలువైన సమాచారాన్ని అందించాయి. అనంతరం అక్కడ రాత్రి సమయం ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు వాటిని స్లీప్‌మోడ్‌లోకి పంపించారు. సెప్టెంబర్‌ 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరిగి సూర్యోదయం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడున్న మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను అనుభవించిన విక్రమ్, ప్రజ్ఞాన్ రెండూ సూర్యకాంతి పడగానే మళ్లీ మేల్కొంటాయా? అన్నదానిపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తే మరో 14 రోజులు వాటి సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే ఇస్రోకు బోనస్ అందినట్టే..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..