Family Crime Story: భర్తను చంపిన భార్య.. విషయం తెలుసుకున్న కొడుకు ఏం చేశాడంటే..! ఎక్సక్లూసివ్ క్రైమ్ వీడియో..

|

Dec 06, 2022 | 9:46 AM

హరిద్వార్‌లోని బహద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్గుబ్‌పూర్ గ్రామంలో జరిగిన జంట హత్య అందరి హృదయాలను కదిలించింది. భార్యాభర్తల మధ్య విభేదాలతో ఇద్దరి జీవితాలు ముగిశాయి.

భర్తను చంపిన భార్య.. విషయం తెలుసుకున్న కొడుకు ఏం చేశాడంటే.. @TV9 Telugu Digital
హరిద్వార్‌లోని బహద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్గుబ్‌పూర్ గ్రామంలో జరిగిన జంట హత్య అందరి హృదయాలను కదిలించింది. భార్యాభర్తల మధ్య విభేదాలతో ఇద్దరి జీవితాలు ముగిశాయి. క్షణికావేశంలో గొడ్డలితో భర్తను హతమార్చింది భార్య. తండ్రి మరణాన్ని చూసిన కుమారుడు తౌహిద్ కూడా సవతి తల్లి గొంతుకోసి హత్య చేశాడు. తల్లిని హతమార్చిన తర్వాత నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మార్గుబ్‌పూర్ గ్రామానికి చెందిన ఇనాముల్ హక్, సితార దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో లూథియానాలో సితార ఒంటరిగా ఉంటోంది. ఇటీవలె ఆమె తన సామాన్లతో సహా తిరిగి గ్రామానికి వచ్చింది. ఊరికి వచ్చిన తర్వాత సితార సవతి పిల్లలతో గొడవలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆగ్రహనికి గురైన సితార తన భర్త ఇనాముల్ హక్‌ను గొడ్డలితో నరికి చంపింది. తండ్రి హత్య విషయం తెలుసుకున్న కొడుకు తౌహిద్ ఇంటికి చేరుకుని కోపంతో సవతి తల్లిని గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Horned Snake: బాబోయ్ కొమ్ములున్న ‘రాక్షసి’ పాము.. ఎప్పుడైనా చూసారా..? హడలెత్తించిందిగా..

Husband harass: 87 ఏళ్ల భార్యపై భర్త శృంగార వేధింపులు.. భరించలేని ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే..

Published on: Dec 06, 2022 09:06 AM