లాటరీ సొమ్ముతో.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో భార్య జంప్ !!

Phani CH

Phani CH |

Updated on: Nov 28, 2022 | 8:46 PM

అదును కోసం చూసింది. అవకాశమొచ్చింది. భర్త, పిల్లలను వదిలి పారిపోయింది. లాటరీ తగడం కుటుంబంలో దు:ఖాన్ని నింపితే.. ఆమె మాత్రం పండుగ చేసుకుంది..

అదును కోసం చూసింది. అవకాశమొచ్చింది. భర్త, పిల్లలను వదిలి పారిపోయింది. లాటరీ తగడం కుటుంబంలో దు:ఖాన్ని నింపితే.. ఆమె మాత్రం పండుగ చేసుకుంది.. థాయ్‌లాండ్‌కు చెందిన మణిత్‌ అనే వ్యక్తి కోటి 30 లక్షల రూపాయల లాటరీ తగిలింది. దీంతో తెగ సంతోషపడ్డ ఆ కుటుంబం.. అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దామనుకున్నాడు. మిగిలిన సొమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే అంతలోనే ఊహించని ఘటనతో అతని జీవితమే మారిపోయింది. అతడి భార్య అంగ్‌కన్‌రత్‌ ఆ లాటరీ సొమ్ము తీసుకుని తన ప్రియుడుతో జంప్‌ అయ్యిపోయింది. లాటరీ తగలడంతో మంచి ధావత్ ఇచ్చాడు. అతనితో పాటు అందరూ ఆనందంగా పార్టీలో మునిగిపోయారు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, మణిత్‌, అంగన్‌రాత్‌లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. అయితే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ తీసుకోకపోవడంతో మణిత్‌కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అకస్మాత్తుగా మరణించింది గోవు.. కన్నీరు పెట్టిన లేగ దూడ..

మూకుమ్మడిగా వీధి కుక్కల దాడి.. రెప్పపాటులో తప్పించుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో !!

ఫిఫా ప్రపంచకప్ ఫీవర్‌.. మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటి కొనుగోలు !!

అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??

జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్‌ డే విషెస్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu