ప్రియుడి కోసం భర్త బలి అమ్మో.. ఆడోళ్లు ఇలా తయారేంట్రా బాబు వీడియో

Updated on: Dec 25, 2025 | 3:00 PM

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చింది. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆపై గుండెపోటుతో మరణించాడంటూ కట్టుకథ అల్లి పోలీసులు, బంధువులను ఏమార్చేందుకు యత్నించింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో ఆమెతోపాటు ప్రియుడిని, మరొకర్ని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వి.జె.అశోక్, జె.పూర్ణిమలకు 2011లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. బోడుప్పల్‌లోని ఈస్ట్‌ బృందావన్‌ కాలనీలో నివసిస్తున్నారు. అశోక్‌ యంనంపేటలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో లాజిస్టిక్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పూర్ణిమ ఇంటి వద్దే ప్లేస్కూల్‌ నిర్వహిస్తోంది. నిర్మాణ కూలీ పాలేటి మహేశ్‌తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్తను కడతేర్చాలని పూర్ణిమ నిర్ణయించుకుని మహేశ్‌ సహకారం కోరింది. డిసెంబర్‌ 11న సాయంత్రం అశోక్‌ కళాశాల నుంచి ఇంటికి రాగా అతడిని మహేశ్, అతని స్నేహితుడు సాయికుమార్‌ కొట్టి కిందపడేశారు. పూర్ణిమ, సాయి గట్టిగా పట్టుకోగా.. మహేశ్‌ మూడు చున్నీలను మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం మహేశ్, సాయి వెళ్లిపోయారు. అనంతరం పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి పూర్ణిమ నాటకానికి తెరలేపింది. తన భర్త బాత్‌రూంలో స్పృహ కోల్పోయి ఉండటంతో మల్కాజిగిరిలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా‌ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారని పోలీసులకు కట్టుకథ చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో