మొగుడికిపట్టిన దెయ్యాన్ని వదిలించిన భార్య !! ఏంచేసిందో చూడండి
ఎన్నో వింతలు, వినోదలకు నెలవు సోషల్ మీడియా అనిచెప్పుకోవచ్చు. ఇందులో వినోదం, విజ్ఞానం అన్నీ అందుబాటులో ఉంటాయి. నెట్టింట లేనిదంటూ ఏదీ ఉండదు..
ఎన్నో వింతలు, వినోదలకు నెలవు సోషల్ మీడియా అనిచెప్పుకోవచ్చు. ఇందులో వినోదం, విజ్ఞానం అన్నీ అందుబాటులో ఉంటాయి. నెట్టింట లేనిదంటూ ఏదీ ఉండదు..పెళ్లిళ్ల దగ్గర్నుంచి భార్యభర్తల గొడవల వరకూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ భార్యభర్తలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భార్యభర్తలిద్దరూ ఓ నదిలో స్నానం చేస్తున్నారు. వారిద్దరూ విహారయాత్రకు వచ్చిన జంటలా ఉన్నారు. ఈ క్రమంలో ఆ భార్య,భర్తలిద్దరూ నదిలో హ్యాపీగా జలకాలాడుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ భర్తకు తన భార్య సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ.. ఒక్కసారిగా ఆమె చింత బరికెలు పట్టుకొచ్చి సదరు భర్త తలపైన, గుండెలపైన కొడుతూ నీటిలో ముంచుతూ లేపుతూ నానా రచ్చ చేసింది. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆమె భర్తకు దెయ్యం పట్టినట్టుంది.. దాన్ని వదిలించే పనిలో పడింది భార్య అంటున్నారు. కొందరు ఇంతకీ అక్కడ దెయ్యం ఎవరని కొందరు ప్రశ్నిస్తుంటే… ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడమంటే ఇదే అంటున్నారు మరికొందరు. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను 15 వేలమందికి పైగా వీక్షించారు. వెయ్యిమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి పీటలపై వరుడ్ని చూడగానే.. ఛీకొట్టి లేచి వెళ్లిపోయిన వధువు !!
1,999 పేజీలు.. 111 పెన్నులు.. 10 లక్షల పదాలతో ప్రేమలేఖ..
ఇంటి రూఫ్‌లో అర్ధరాత్రి వింత శబ్ధాలు.. చెక్‌చేస్తే ఒళ్లుగగుర్పొడిచే సీన్..
వింత ఆచారం.. మొగుళ్లను తన్నిన తరువాతే భోజనం
ఉండుంటే.. తమ్ముడిలా.. పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారు