Thief in well: గర్ల్స్‌ హాస్టల్‌లో చోరీ చేసి పరార్. కట్ చేస్తే బావిలో తేలాడు..! ఎం జరిగిందంటే..

|

Jan 29, 2023 | 9:29 AM

హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్‌లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయబావిలో జారిపడ్డాడు.

గర్ల్స్‌ హాస్టల్‌లో చోరీ.. పారిపోతూ బావిలో పడ్డ దొంగ..! - TV9
హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్‌లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయబావిలో జారిపడ్డాడు. హన్మకొండ శివారులో ఉన్న కాలేజీ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేశాడు. చిమ్మ చీకటిలో పొలాల గుండా పారిపోతుండగా వ్యవసాయ బావిలో పడిపోయాడు. బావిలో నుండి దొంగను గ్రామస్తులు బయటకు తీశారు. హసన్‌పర్తి మండలం అన్నసాగర్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థినుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు చోరీ చేశాడు. మూడు రోజల టైమ్‌లో 14 సెల్‌ఫోన్లు, 6 ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లాడు. బాత్‌రూమ్స్‌ డోర్‌ పగులగొట్టి హాస్టల్‌ గదిలోకి దొంగ ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తమకు హాస్టల్‌లో భద్రత లేదని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 29, 2023 09:29 AM