Kerala: కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రపోతున్న వారి ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు నేలమట్టమవ్వడం.. వాటి కింద వందలాదిమంది ఇరుక్కుపోవడం.. ఎటూ కదలలేక.. ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి. కేరళలో ఆ విలయం అర్థరాత్రితో ఆగలేదు. తెల్లవారుజామున మళ్లీ మరోసారి బీభత్సం సృష్టించింది. దీని దెబ్బకు సహాయశిబిరంతోపాటు అక్కడున్న ఇళ్లు, షాపులు అన్నీ ధ్వంసమయ్యాయి.
అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రపోతున్న వారి ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు నేలమట్టమవ్వడం.. వాటి కింద వందలాదిమంది ఇరుక్కుపోవడం.. ఎటూ కదలలేక.. ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి. కేరళలో ఆ విలయం అర్థరాత్రితో ఆగలేదు. తెల్లవారుజామున మళ్లీ మరోసారి బీభత్సం సృష్టించింది. దీని దెబ్బకు సహాయశిబిరంతోపాటు అక్కడున్న ఇళ్లు, షాపులు అన్నీ ధ్వంసమయ్యాయి. దేవభూమిలో.. వయనాడ్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో టీ, కాఫీ తోటల్లో పనిచేయడానికి అసోంతోపాటు పశ్చిమబెంగాల్ నుంచి వలస కూలీలు వస్తుంటారు. వారిలో 600 మంది ఆచూకీ కూడా కనుక్కోలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పశ్చిమకనుమల్లో జలప్రళయానికి అసలు కారణాలేమిటి?
ఈ శతాబ్దంలోనే అంతులేని విషాద ఘటన మాత్రం 2018లోనే జరిగింది. ఆ 2018 నాటి ప్రకృతి విలయం తరువాత అంతటి బీభత్సం సృష్టించిన దారుణమైన ఘటన ఏదైనా ఉందీ అంటే అది ఇదే. 2018 లో వర్షాలు భీకరంగా కురవడంతో 483 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 14 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కేరళ రాష్ట్రం బడ్జెట్ కు ఎంత కేటాయిస్తారో.. అంత మొత్తంలో ఆ ఏడాది నష్టం వాటిల్లింది. దీనిని బట్టి కేరళ ఎంత తీవ్రంగా నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కేరళలో కొండచరియలు విరిగిపడడం కొత్త కాకపోయినా.. ఈ స్థాయిలో మృతుల సంఖ్య లేదనే చెప్పాలి. 2019లో ఇదే వయనాడ్ లోని పుత్తుమలలో 17 మందిని బలిగొన్నది కొండచరియలు విరిగిపడిన ఘటనే. 2021లో కొట్టాయం, ఇరుక్కి ఘటనలో 35 మంది, ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఆకస్మిక వరదల వల్ల 18 మంది చనిపోయారు. ఇక్కడ ఇంకో సంఘటన గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. మన దేశంలో 2015 నుంచి 2022 వరకు అంటే ఆ ఏడేళ్ల మధ్య కొండ చరియలు విరిగిపడిన ఘటనలు అనేకం జరిగాయి. నెంబర్ చెప్పాలంటే.. 3,782. ఇందులో ఒక్క కేరళలోనే.. 2,239 ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిని బట్టి కేరళ రాష్ట్రం ఎంతటి పెను విషాదాలను ఎదుర్కొంటోందో అర్థమవుతుంది.
కేరళలో ప్రకృతి విలయానికి, అరేబియా సముద్రం వేడెక్కడానికి సంబంధమేంటి? ఈ రెండింటికీ మధ్య కచ్చితంగా బంధముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల.. మేఘాల వ్యవస్థ దట్టంగా మారుతోంది. దీనివల్ల.. తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలో వేడి పెరుగుతోంది. దీని ఎఫెక్ట్ కేరళతో పాటు ఆ ప్రాంతంపై పడుతోంది. దీనివల్ల అక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం తప్పడం లేదు. ఇది అక్కడి వాతావరణాన్ని అస్థిరంగా మారుస్తోంది. ఈ పరిస్థితులే.. అ ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఇలాంటి క్లౌడ్స్ ను శాస్త్రవేత్తలు కూడా ముందుగానే గుర్తించారు. కానీ ఇది ఇంతటి విషాదానికి కారణమవుతుందని అంచనా వేయలేకపోయారు. దీంతో ఈ విధ్వంసం తప్పలేదు. ఒకవేళ ఇలాంటి వాటిని ముందే గుర్తించే వీలుంటే.. ఇలాంటి పెను విషాదం చోటుచేసుకునేది కాదు. ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు. కానీ ఇలాంటి దుర్ఘటన మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.