వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్​ షీట్​తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు

వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్​ షీట్​తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు

Phani CH

|

Updated on: Jul 18, 2022 | 8:43 PM

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు నగరంతో సంబంధాలు తెగిపోయి రవాణా వ్యవస్థ కుప్పకూలింది.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు నగరంతో సంబంధాలు తెగిపోయి రవాణా వ్యవస్థ కుప్పకూలింది. ఈ క్రమంలోనే హడ్గావ్ తాలూకాలోని కొర్రీకి చెందిన వరుడు.. పెళ్లి మండపానికి చేరుకునేందుకు పెద్ద సాహాసం చేశాడు. థర్మకోల్​ షీట్​ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్​ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్​ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు. తమ జీవితాలను రిస్క్‌లో పెట్టి వరదలో ప్రయాణించి వివాహ వేడుకకు చేరుకున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం మహారాష్ట్రలోని పంగంగ, కయాధు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల సంగమ ప్రాంతంలో ఉన్న చించోలి గ్రామానికి నగరంతో సంబంధాలు తెగిపోయి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో అనుకున్న ముహూర్తానికే అక్కడ పెళ్లి జరిపేందుకు వారు ఈ ప్రమాదకర స్టంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Jagan: కుండ బద్దలు కొట్టిన సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్.. లైవ్ వీడియో

Published on: Jul 18, 2022 08:43 PM