వివాహ వేదికపై పుష్-అప్‌లు ఇప్పుడిదో నయా ట్రెండ్
పెళ్లిళ్లు ఇప్పుడు కేవలం సంప్రదాయ వేడుకలు మాత్రమే కాదు, సరికొత్త ట్రెండ్‌లకు వేదికలు. ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో పుష్-అప్స్ పోటీలు ట్రెండ్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలలో, వధువు/వరుడి తరపు వారు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లతో సందడి చేస్తున్నారు. జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీఖా కోహ్లీ నుండి ఫిట్‌నెస్ కోచ్ జంట వరకు, ఈ పోటీలు పెళ్లిళ్లకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అని ఓ సినీ కవి రాశాడు. ఇప్పుడు ఆ పాటను మార్చి రాసుకునే రోజులొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు చూశాక పెళ్లంటే పుష్ అప్స్ అని రాసుకోవాల్సిందే. పెళ్లిళ్లలో ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్‌లు, పెళ్లీపీటల మీదికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం, అంతకంటే గ్రాండ్‌గా పెళ్లి ఊరేగింపులు, అంత్యాక్షరీలు, పాటల పోటీలు జరపడం వంటివి రొటీనే అంటున్నాయి పలు జంటలు. ఇప్పుడు పెళ్లిలో పుష్ ఆప్స్ పోటీలు నయా ట్రెండ్‌గా మారాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ వీడియోలో పెళ్లి సందడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వధువు తరపువారు, వరుడి తరపు వారు ఒక్కదగ్గర చేరి తెగ సందడి చేస్తున్నారు. నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీఖా కోహ్లీ వధువు తరపున ఆ పెళ్లిలో తెగ సందడి చేసింది. ఈ క్రమంలో వరుడి తరపు వారితో ఓ పందెం మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఫిట్నెస్ వీడియోలతో ఫేమస్ అయిన కోహ్లీతో పోటీ పడాలని వరుడి తరపువారు ఆసక్తి కనబరుస్తారు. ఇంతలో ఓ యువకుడు ముందుకొస్తాడు. ఇంకేముంది ఇరువురి బంధుమిత్రుల చప్పట్ల మధ్య పోటీ ప్రారంభవుతుంది. ఇద్దరు తొలుత ఉత్సాహంగా పుష్ అప్స్ ప్రారంభిస్తారు. కాసేపయ్యాక యువకుడు ఆలసిపోయినట్లు కనిపిస్తాడు. ఇంతలో శ్రీఖా కోహ్లీ కూడా ఇక చాలన్నట్లుగా ఉంటుంది. కానీ ఎవరూ తగ్గేదేలె అన్నట్లుగా పుష్ అప్స్ చేస్తూనే ఉంటారు. బంధుమిత్రులు మాత్రం చప్పట్లతో వారిని ఉత్సాహపరుస్తుంటారు. కెమెరామెన్ తన కెమెరాలో ఈ తతంగమంతా బంధిస్తుంటారు. ఇంతలో యువకుడు ఆలసిపోయి కుప్పకూలుతాడు. నీదే విజయం అంటూ కోహ్లీని అభినందిస్తాడు. దీంతో కోహ్లీ గర్వంగా నవ్వుకుంటుంది. ఇక మరొక వీడియోలో అక్షితా అరోరా, ఆదిత్య మహాజన్.. వివాహం చేసుకున్నప్పుడు, ఫిట్‌నెస్, వ్యాయామం పట్ల తమకున్న ప్రేమను ప్రదర్శించే ప్రత్యేకమైన పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిట్టర్ విత్ స్క్వాడ్‌లో ఫిట్‌నెస్ కోచ్‌లైన ఈ జంట వివాహ వేదికపై పుష్-అప్‌లు చేయాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధూవరులు వివాహ వేదికపై పుష్-అప్‌లు చేస్తున్నట్లు చూడవచ్చు. అక్షితా అరోరా, ఆదిత్య మహాజన్ ఇద్దరూ పెళ్లి దుస్తుల్లోనే వేదికపై పుష్ అప్స్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RBI: బంగారం కాకుండా ఈ లోహంతో లోన్ తీసుకోవచ్చా? ఎంత ఇస్తారు?
మీ పేరుతో ఇంకో సిమ్ యాక్టివేషన్.. తర్వాత విదేశాలకు అమ్మకం
Time Bank in Kerala: కేరళలో ‘టైమ్ బ్యాంక్’.. ఏం దాచుకుంటారంటే