Wedding Kits: కొత్త జంటలకు వెడ్డింగ్ కిట్‌లు.. ప్యాక్‌లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు..ప్రభుత్వ కొత్త పథకం
ఒడిశా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెప్టెంబరు నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఒడిశా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెప్టెంబరు నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకీ ఆ పథకం ఏంటి? అందులో ఏముంటాయి.. పైగా కొత్తజంటలకు మాత్రమే అంటున్నారు.. అనుకుంటున్నారా… అవును.. ఇది కొత్తగా పెళ్లయినవారి కోసమే.. ఈ వివాహ కిట్‌లో కండోమ్‌లతో పాటు కుటుంబ నియంత్రణకు సంబంధించిన అనేక ఇతర వస్తువులను ఉంచుతున్నారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. వివాహ కిట్‌లో కుటుంబ నియంత్రణ పద్ధతులు, దాని ప్రయోజనాలు, వివాహ నమోదు ధృవీకరణ పత్రం, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు వంటి సమాచారంతో కూడిన పుస్తకం ఉండనుందంట. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ కిట్, టవల్, దువ్వెన, నెయిల్ కట్టర్, మిర్రర్ కూడా ఉంటుంది. కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి యువ జంటలకు అవగాహన కల్పించడం, వాటిని పాటించేలా వారికి అవగాహన కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.ఈ పథకం గురించి ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బిజయ్ పాణిగ్రాహి మాట్లాడుతూ, ఇది నేషనల్ హెల్త్ మిషన్ ‘నాయి పహల్ యోజన’లో ఒక భాగం. కొత్తగా పెళ్లయిన జంటల్లో కుటుంబ నియంత్రణ పాటించేలా అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఇది జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం, ఆశా వర్కర్లకు శిక్షణ ఇస్తున్నారు. వారు ప్రజలకు అవగాహన కల్పిస్తారు’ అని తెలిపారు. అయితే ఈ పథకాన్ని ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలవనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
