Wedding in heavy rain: వరుడి వింత చేష్టలు..వానవెలిసేదాక ఆగలేకపోయాడు..! వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతినిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు నెటిజన్లు మురిపిస్తున్నాయి. ఇక కరోనా కాలం నుంచి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు మాత్రం కో కొల్లలుగా వైరల్ అవుతున్నాయి..ముఖ్యంగా వధువరులకు సంబంధించి పెళ్లి తంతులోని వింత సంఘటనలు,
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతినిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు నెటిజన్లు మురిపిస్తున్నాయి. ఇక కరోనా కాలం నుంచి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు మాత్రం కో కొల్లలుగా వైరల్ అవుతున్నాయి..ముఖ్యంగా వధువరులకు సంబంధించి పెళ్లి తంతులోని వింత సంఘటనలు, విచిత్ర సంప్రదాయాలు ఇంటర్‌నెట్ ప్లాట్‌ఫామ్ వేదికగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జోరువానలో బయల్దేరిన పెళ్లిబృందం వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వైపు కుండపోత వర్షం పడుతుంది…మరోవైపు ఓ పెళ్లి బృందం జోరువానలోనే ఊరేగింపుతో వెళ్తోంది..పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు బంధుమిత్రులు సైతం వానలోనే గొడుగులు పట్టుకుని మరీ తడుస్తూ..పెళ్లి బరాత్ కొనసాగిస్తున్నారు..ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. వరుడు వధువుతో పాటే… గొడుగు అడ్డం పెట్టుకుని గుర్రంపై వెళ్తున్నాడు..మిగిలిన పెళ్లివారంతా అదిరిపోయే ముస్తాబుతో..బురద నీటిలోనే నడుచుకుంటూ పెళ్లి నడక సాగిస్తున్నారు. అందరూ తలకు అంబ్రెల్లా పెట్టుకున్నారనుకోండి..అది లేని వారు కొందరు ఏకంగా ఏదో పెద్ద సైజున్న బౌల్ నెత్తిమీద బోర్ల పెట్టుకుని వెళ్తున్నారు..ఇంకొందరు చెప్పులు, షూ చేతపట్టుకుని తప్పదురా అన్నట్టుగా పయనిస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు..వీడేం ఆత్రం పెళ్లి కొడుకురా బాబు..వాన వెలిసేదాకా కూడా ఆగలేక పోయాడా..? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీడి పెళ్లి మీ తలనొప్పికి వచ్చిందిలేండీ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

