గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

Updated on: May 06, 2025 | 5:12 PM

ప్రతిరోజూ దేవుడి గుడికి ఎందరో భక్తులు వస్తుంటారు. తమ కోర్కెలు నెరవేర్చమని, కష్టాలు తీర్చమని వేడుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. పూజలు నిర్వహిస్తారు.. హుండీల్లో కానుకలు కూడా వేస్తారు. అయితే ఇలా గుడికి వచ్చి వంగి వంగి దండాలు పెడుతూ.. మంత్రాలు జపిస్తూ ప్రదక్షిణలు చేసేవారంతా భక్తులేనా అంటే.. ఏమో.. వారిలో దొంగలు కూడా ఉండొచ్చు.

భగవంతుడిని వేడుకున్నట్టే వేడుకొని ఆయనకే శఠగోపం పెట్టే దొంగ భక్తులు ఉంటారు. కొందరు నేరుగా దొంగతనం చేస్తే కొందరు భక్తి నటిస్తూ చోరీలకు పాల్పడతారు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. మొన్నీమధ్య తమిళనాడులో ఓ దొంగ గుడిలో చోరీకి యత్నంది హుండీలో చెయ్యి పెట్టగానే చెయ్యి అందులో ఇరుక్కుపోయి పోలీసులకు దొరికిపోయాడు. కానీ ఈ దొంగ మాత్రం దేవుడికి దండం పెట్టి ఆయనకే శఠగోపం పెట్టాడు. కర్నాటకలోని మంగళూరు నగరం మేరీహిల్‌లో కొరగజ్జన టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చిన ఓ దొంగ ముందుగా భక్తితో దేవుడికి నమస్కరించాడు. గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు కూడా చేశాడు. చివరిగా మరోసారి కొరగజ్జనకు నమస్కరించి, ఆపై అక్కడే ఉన్న హుండీ చంకనపెట్టుకొని ఉడాయించాడు. ఈ వ్యవహారమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దొంగ భక్తుడు చేసిన పనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాణం తీసిన చెవినొప్పి..

TOP 9 ET News: 100 కోట్లు కొల్లగొట్టిన సర్కార్‌.. హాలీవుడ్ లోనూ కలెక్షన్ల రచ్చ

ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు ?? బన్నీ- బ్రహ్మీ ట్రోల్స్‌ వాసు అసహనం

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు.. ఇక చిప్ప కూడే గతి ??