Viral Video: మెట్రో ట్రైన్‌లో బుద్దిగా ప్రయాణం చేసిన కోతి.. నెట్టింట వైరల్ వీడియో…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే ఫన్నీ పనులకు సంబంధించిన వీడియోలు ఐతే ఓ రేంజ్‌లో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెట్ర ట్రైన్ ఎక్కిన కోతి అద్దంలో నుంచి ఢిల్లీ నగరంను చూస్తూ, తెగ ఎంజాయ్ చేసింది. అంతటితో ఆగకుండా, ట్రైన్‌లోని ప్రతి ఒక్క ప్యాసింజర్ వద్దకు వెళ్లి, అతడి పక్కనే కాసేపు కూర్చోని టైంపాస్ చేసింది. అయితే ఎంతో పకట్బంధిగా ఉండే మెట్రో సెక్యూరిటీని దాటుకుని కోతి ఎలా ట్రైన్ ఎక్కిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో అధికారులు, సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Himachal Pradesh: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు.. కంగుతిన్న దుకాణదారుడు.. ( వీడియో )
Viral Video: చైనా ల్యాబ్ నుంచి బయటకొచ్చిన వయాగ్రా దోమలు..!! ( వీడియో )