సాగర తీరాన ‘బీచ్‌ ఫెస్టివల్‌’కు వేళాయె వీడియో

Updated on: Dec 14, 2025 | 5:11 PM

విశాఖపట్నంలో జనవరి 23 నుండి 31 వరకు తొమ్మిది రోజుల పాటు విశాఖ ఉత్సవ్ బీచ్ ఫెస్టివల్ జరగనుంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ఉత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖ టూరిస్ట్‌లకు శుభవార్త. తొమ్మిది రోజుల పాటు విశాఖ తీరంలో పర్యాటకుల పండుగకు ముహూర్తం ఖరారైంది. జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా వినోదం, ఆహారంతో పాటు దేశ, విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో