AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీ దుంపతెగ.. ఇదేం సాహసం రా నాయనా.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో చూడండి..!

సోషల్ మీడియాలో చాలా షాకింగ్ వీడియోలను మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వీడియోలలో వాళ్లు చేసే సాహసాలకు సలాం కొట్టాలనిపిస్తే.. మరికొన్ని మాత్రం అలాంటివి చేసినందుకు కామెంట్లతో కడిగేయాలనిపిస్తుంటుంది.

Viral Video: నీ దుంపతెగ.. ఇదేం సాహసం రా నాయనా.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో చూడండి..!
Viral Video News
Venkata Chari
|

Updated on: Jul 18, 2021 | 8:33 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో చాలా షాకింగ్ వీడియోలను మనం చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని భయపెడతాయి. మరికొన్ని షాకిచ్చినా నవ్విస్తుంటాయి. మరికొన్ని మాత్రం వీడియోలో వాళ్లు చేసే సాహసాలకు సలాం కొట్టాలనిపిస్తే.. మరికొన్ని మాత్రం అలాంటివి చేసినందుకు తిట్టాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ప్రాణాలతో చెలగాటమాడుతూ వీడియోలు చేస్తుంటారు కొందరు. అలాంటి వారిలో ఈ వీడియోలో ఉన్నతను కూడా ఒకడు. ఈయనకు స్కేట్ బోర్డింగ్ ఆడేందుకు జాగ ఎక్కడ దొరకనట్టుంది. ఏకంగా ఎంతో ఎత్తైన వంతెన పై నుంచి స్కేట్ బోర్డింగ్ ఆడేందుకు సాహసం చేశాడు. ఈయన గారు చేసిన సాహసాన్ని మొదటిసారి చూడాలంటే మాత్రం కొంచెం భయంగానే అనిపించొచ్చు. అసలు విషయాని వస్తే.. ఓ వ్యక్తి స్కేట్ బోర్డింగ్ ఆడేందుకు చాలా ఎత్తైన వంతెన పైకి చేరుకుంటాడు.

ఒక కాలు స్కేట్ బోర్డింగ్ పై పెట్టి, రెండో కాలు బోర్డుపై పెట్టి అమాంతం దూకేస్తాడు. చూడడానికి కొంచెం భయాంగానే ఉన్నా.. అతను పారాచూట్‌ కట్టుకుని దూకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో నెటిజన్లు మనోడి సాహసాన్ని తిట్టకుంటూ కామెంట్లు చేశారు. ఇది ఫన్ కాదురా నాయనా.. ఆత్మహత్య అంటూ కొందరు కామెంట్లు చేయగా, నీకు స్కేట్ బోర్డింగ్ చేసేందుకు ప్లేస్ ఎక్కడా దొరకలేదురా నాయనా అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు ఈయన సాహసాన్ని మెచ్చుకుంటూ కూడా కామెంట్లు చేశారు.

Also Read:

iSmart News Video: మంటల మధ్యలో నిలపడి నిరసన చేసిన టీడీపీ నాయకులు వైరల్ అవుతున్న వీడియో..