ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహరైచ్ జిల్లా ఆసుపత్రిలో ఓ ఎద్దు స్వైరవిహారం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి చొరబడి భీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఓపీ విభాగంలో రోగులు ఎవరూ లేరు. సిబ్బంది కానీ వైద్యులు కానీ లేని ఆసుపత్రి ఖాళీగా కనిపించింది. దీంతో ఆ ఎద్దును ఆపేవారు ఎవరూ లేకపోవడంతో ఇష్టారీతిన గదులన్నీ తిరిగింది.
ఓ గదిలో నేరుగా డాక్టర్ కుర్చీ వద్దకు నడుచుకుంటూ వెళ్లి డెస్క్ పై ఉన్న కాగితాలను నమలేసింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తమ బాధ్యతను మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించారని వీడియో చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బహరైచ్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎద్దు స్వేచ్ఛగా తిరగడం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భవనం బయట మరికొన్ని పశువులు నిలబడి ఉండటం కూడా వీడియోలో స్పష్టంగా కనిపించింది. వైరల్ అయిన వీడియోపై జిల్లా ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న బహరైచ్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు ఇప్పటివరకు సిబ్బందిపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :