ఫ్రిజ్‌‌లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్‌

Updated on: Jul 06, 2025 | 3:15 PM

ఇంట్లోని సభ్యులందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో ఇంట్లోనుంచి వింత శబ్దాలు వినిపించాయి. అయితే, వారు ఆ సౌండ్స్‌ను గమనించకుండానే, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. అయినా, ఆ సౌండ్స్ ఆగకపోయే సరికి ఆ శబ్దాలు ఎక్కడినుంచి వస్తున్నాయా అని ఇల్లంగా గాలించినా ఏమీ కనిపించలేదు. చివరిగా ఫ్రిజ్‌ వద్ద చూడగా, ఆ సౌండ్స్ ఫ్రిజ్‌లో నుంచే వస్తున్నట్లు నిర్ధారించుకున్నారు.

ఏమై ఉంటుందా అని భయపడుతూనే ఫ్రిజ్‌ ఓపెన్‌ చేశారు. వారు ఊహించినట్టే జరిగింది. ఫ్రిజ్‌ వెనుక ఒక రాడ్‌ లాంటిదానికి ఓ విష సర్పం చుట్టుకొని కనిపించింది. దాన్ని చూసి భయంతో వణికి పోయిన ఆ కుటుంబ సభ్యులు.. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ ఫ్రిజ్‌ వెనుక ఉన్న పామును గుర్తించారు. అది అత్యంత ప్రమాదకరనమై విషపూరితమైన కామన్‌ క్రైట్‌ అని గుర్తించారు. ఎట్టకేలకు దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదలి పెట్టారు. ఆ పామును పడుతున్న ప్రాసెస్‌ మొత్తాన్ని స్నేక్ క్యాచర్ బృందం వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఈ వీడియోను 7 లక్షలమందికి పైగా వీక్షించగా 15 వేలమందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందా? అయితే, ఈ పది రకాల ఆహార పదార్థాలు మీ కోసమే

గర్భస్రావం తర్వాత జుట్టు రాలుతోందా ?? తగ్గించాలంటే ??

మన నిద్రను శాసించేది ఇవే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు