Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
దేశంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతుండటంతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అయితే ఎండలు ఎంత ఉన్నా ఉద్యోగులు, వాహనదారులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు తప్పకుండా
దేశంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతుండటంతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అయితే ఎండలు ఎంత ఉన్నా ఉద్యోగులు, వాహనదారులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు తప్పకుండా బయటకు వెళ్లాల్సిందే. ఇక ఈ ఎండలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగితే ఈ నరకమే. అలాంటి వారి కోసం పుదుచ్చేరి ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రీన్ నెట్స్ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసింది. పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పలు సిగ్నళ్ల వద్ద కొంత దూరం వరకు ఈ గ్రీన్ షేడ్ నెట్‌ను ఏర్పాటు చేసింది. దీని వల్ల సిగ్నల్స్ వద్ద ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చు. వాహనదారులకు ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.