ఓర్నీ.. ఈ వయసులో మీకిదేం పిచ్చిరా సామీ !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

|

Dec 21, 2022 | 7:26 PM

మనలోని చిన్నపిల్లవాడిని ఎప్పటికీ అణచివేయకూడదంటారు మన పెద్దలు . ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని ముగ్గురికీ కూడా వారి పెద్దవాళ్లు ఇదే మాటను బాగా చెప్పి ఉంటారు.

మనలోని చిన్నపిల్లవాడిని ఎప్పటికీ అణచివేయకూడదంటారు మన పెద్దలు . ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని ముగ్గురికీ కూడా వారి పెద్దవాళ్లు ఇదే మాటను బాగా చెప్పి ఉంటారు. అందుకే నడి వయసులో కూడా చిన్నతనంలో ఆడినట్లుగా రోడ్డు మీద షర్ట్ తీసేసి మరి నీళ్లల్లో ఆడుకుంటున్నారు. అంతేనా రోడ్డు మీద ఉన్న నీళ్లపై కార్లు వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు తమపై పడుతుంటే ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఇంకా రోడ్డు మీదుగా వెళ్లే కార్లను తమపై నీళ్లు పడేలా నడపమని సైగలు చేస్తున్నారు. ఇంకా తమపై నీళ్లు చల్లేందుకు కార్లు రావాలన్నట్లుగా రోడ్డు మీద ఎదురు చూస్తున్నారు. ‘డంకన్ కుకార్డ్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఒక అమ్మాయితో పాటు నల్లటి షార్ట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి ఉన్నారు. ఆరోడ్డుపైన నీళ్లు నిలిచి ఉన్నాయి. ఆ నీటిని చూడగానే వారికి ఆడుకోవాలనిపించినట్లుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వెరీ ఇంట్రెస్టింగ్‌ !!

పొట్ట కూటికోసం చిన్నారుల విన్యాసాలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

సర్కార్‌ దవాఖానలో జడ్జి ప్రసవం.. ఆదర్శంగా జస్టిస్‌ షాలిని

ప్రయాణికుల బంపర్ ఆఫర్.. గుంజీలు తీస్తే ఫ్రీగా బస్సు టిక్కెట్‌ !!

ఇది బ్రిటిష్‌ మిర్చి బజ్జీ.. గుంటూరు మిర్చిని మించి !!

Published on: Dec 21, 2022 07:26 PM