ఆహారం తింటున్న సింహాన్ని వీడియో తియ్యాలనుకున్నాడు.. అంతే

Updated on: Aug 08, 2025 | 8:38 PM

సాధారణంగా సింహం ఆకలిగా ఉన్నప్పుడే వేటాడుతుంది. మిగతా సమయంలో దాని సమీపానికి వచ్చిన ఏ జంతువునూ ఏమీ చేయదు. అలా ఆకలితో ఉన్న సింహం వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తింటుండగా.. ఓ వ్యక్తి వీడియో తియ్యాలనుకున్నాడు. అంతే ఒక్కసారిగా అతనిపై దాడికి వచ్చింది సింహం. అదృష్టం బావుండి అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గుజరాత్‌లోని భావ్‌నగర్లో సింహాలు సంచరించే ప్రాంతంలోనికి పర్యటనకు కొందరు వ్యక్తులు వెళ్లారు. అక్కడ ఓ సింహం అప్పుడే వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ కనిపించింది. అది చూసి ఓ వ్యక్తి సింహాన్ని దగ్గరనుంచి వీడియో తియ్యాలనుకున్నాడు. తన మొబైల్‌ ఫోన్‌లో సింహాన్ని వీడియో తీస్తూ సింహానికి సమీపంగా వెళ్లాడు. అది గమనించిన సింహం నా మానాన నేను ఆహారం తింటుంటే మధ్యలో నీ డిస్టర్బెన్స్‌ ఏంటి? అన్నట్టుగా ఒక్కసారిగా అతనివైపు దూసుకొచ్చింది. భయంతో వెనక్కి పారిపోతున్న అతనిపై దాడి చేయబోయింది. చివరికి ఎలాగోలా సింహంనుండి తప్పించుకుని తనవాళ్లదగ్గరకు పరుగెత్తాడు. ఆ వ్యక్తితో పాటు మరి కొందరు ఉండటంతో ఆ సింహం వెనక్కి తగ్గింది. తన ఆహారం తినేందుకు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి, ఇతరులు ఆ సింహం బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. అతడు కూడా దానికి ఆహారం అయ్యేవాడని, అదృష్టవశాత్తు బతికిపోయాడని కొందరు కామెంట్‌ చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి లక్షల కోట్లు..! అసలేం జరిగిందంటే.

New Traffic Rules: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే.. అంతే

గుడ్‌న్యూస్‌.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు

Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?

సునామీని సైతం అడ్డుకునే అడవులివే! ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకుల క్యూ