Viral Video: మనం సాధారణంగా చాలా రకాలైన ఆక్టోపస్‌లను చూసే ఉంటాం. కానీ, ఇలాంటి ఆక్టోపస్‌ను మాత్రం చూసి ఉండరు. అసలు గ్లాస్ ఆక్టోపస్ గురించి ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదూ. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే మీరు చూడబోతున్నారు. అసలు గ్లాస్ ఆక్టోపస్ ఉంటుందని నమ్మబుద్ధి కావడంలేదా. అయితే ఈ వీడియో చూడండి మరి. దీనిలో గ్లాస్ ఆక్టోపస్ మొత్తం పారదర్శకంగా కనిపించింది. ఫినిక్స్ ఐలాండ్ టీం రికార్డు చేసిన ఓ వీడియోలో దీని గురించి బయటకు తెలిసింది. వీరు 20 నిమిషాల పాటు గ్లాస్ ఆక్టోపస్‌ను వీడియో తీశారు. ఈమేరకు స్మిత్ ఓషన్ ఇనిస్టిట్యూట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఈ సముద్రజీవి పెలాజిక్ జాతికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణమండలాల్లోనే ఇలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయంట.
నీటిలో కదులుతున్నప్పుడు ఈ ఆక్టోపస్ శరీరం లోపలి భాగాలు చాలా క్లియర్‌గా కనిపించాయి. వీటిలో కనుబొమ్మలు, ఆప్టిక్ నరం, జీర్ణవ్యవస్థలు వెండిరంగులో మధ్యలో కనిపించాయి. దీని శరీర నిర్మాణం ఇతర జంతువలు బారిన పడకుండా ఉండేందుకు ఇలా రూపొందినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి:
Also Read:
Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా… బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?
Live Video: తెలంగాణ టీడీపీ ఇక ఖతమేనా…?? ఎల్. రమణ తో ముఖా ముఖి లైవ్ వీడియో…