70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్ళ సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్న వృద్ధ దంపతులు. రాజస్థాన్ లోని డంగర్ పూర్ జిల్లా గలందర్ గ్రామంలో 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న 90 ఏళ్ల మహిళ, 95 ఏళ్ల పురుషుడు పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ లోని డంగర్ పూర్ జిల్లా గలందర్ అనే గిరిజన గ్రామంలో గత 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న వృద్ధ దంపతులకు పెళ్లి చేసుకోవాలనిపించింది. 70 ఏళ్ల సహజీవనంలో వారికి ఆరుగురు సంతానం కలిగారు. వారిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.
అయితే తమ తొమ్మిది పదుల వయసులో వీరికి పెళ్లి ముచ్చట తీర్చుకోవాలనిపించింది. ఆ విషయాన్ని వారి పిల్లల ముందు ఉంచారు. ఈ వృద్ధ దంపతుల పెద్ద కుమారుడికి 60 ఏళ్లు. వారి పిల్లలకు కూడా వివాహాలు జరిగి కుటుంబాలుగా ఏర్పడ్డారు. జీవిత చరమాంకంలో పెళ్లి ముచ్చట తీర్చుకోవాలనుకున్న తల్లిదండ్రుల కోరిక నెరవేర్చేందుకు కుటుంబ సభ్యులంతా సిద్ధమయ్యారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులంతా కలిసి సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వృద్ధ ప్రేమ జంటకు వివాహం జరిపించారు. జూన్ ఒకటో తేదీన హల్దీ వేడుకతో పెళ్లి సంబరాన్ని మొదలుపెట్టి జూన్ 4న ఇద్దరికీ పెళ్లి చేసి డిజే పాటలతో వృత్తాలతో ఊరంతా ఊరేగింపు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో
రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో
వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
వైరల్ వీడియోలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

