Viral Video: గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్.. పక్కా స్కెచ్ వేసినా బెడిసికొట్టింది.. వీడియో చూస్తే షాకవుతారు..!

|

Feb 07, 2022 | 3:40 PM

Trending Video: అంతా ప్లాన్ చేసుకున్నాడు. మద్దతుగా స్నేహితలు కూడా ఉన్నారు. అయినా వారి ప్రయత్నం విఫలమవడంతో కొద్దిసేపు భయాందోళనలు కలిగించారు. ఈ వీడియో నెట్టింట్ షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది.

Viral Video: గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్.. పక్కా స్కెచ్ వేసినా బెడిసికొట్టింది.. వీడియో చూస్తే షాకవుతారు..!
Swim Viral Video
Follow us on

Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని నవ్వులు కురిపిస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అలాగే మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రస్తుతం ఓ అథ్లెట్ చేసిన సాహసం.. నెట్టింట్లో భయాందోళనలు కలిగించింది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో చల్లటి నీటితో స్నానం చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ సమాధానం నో అయితే ఈ వీడియో చూడండి. అర్థనగ్నంగా గడ్డకట్టిన సరస్సులో ఈతకొడుతున్న ఓ అథ్లెట్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మొదటిసారి చూసిన నెటిజన్లు షాకవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్, తన స్నేహితులు కలిసి నెటిజన్లకు షాకింగ్ వీడియోను అందించే ప్రయత్నం చేసినా, అది వర్కవుట్ కాకపోవడంతో నెటిజన్లలో చాలామంది తిడుతూ కామెంట్లు చేశారు. మరికొంతమంది మాత్రం సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడుకున్నావు అంటూ కామెంట్లు చేశారు.

బోరిస్ ఒరావెక్ చల్లని నీటిలో స్విమ్మింగ్ నైపుణ్యాలను చూపిస్తూ ఈ చిన్న క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్(Instagram), టిక్‌టాక్ (TikTok)లో షేర్ చేశారు.  31 ఏళ్ల బోరిస్ గడ్డకట్టిన సరస్సులో ఈతకొట్టేందుకు సిద్ధమైనట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకు తన స్నేహితులు కూడా తమ వంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతా ఓకే అనుకున్నాక గడ్డకట్టిన సరస్సులో ఓ రంద్రం ద్వారా కిందుకు వెళ్లి, తన ప్రయాణం ప్రారంభించాడు. ఇంతలో మరోవైపు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో భయాందోళనలకు గురి అయ్యాడు. కొద్దిసేను అక్కడే తిరిగి ఇబ్బందులు పడుతున్న బోరిస్‌ను చూసి, విషయం అర్థం చేసుకున్న అతని స్నేహితులు తమవంతుగా మంచు గడ్డను పగల కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఎంతకీ పగలకపోవడంతో, బోరిస్ వెళ్లిన మార్గంలోనే మరలా వెనక్కు తిరిగి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.

ఈ తతంగాన్నంతా మంచు గడ్డపై నిల్చున్న అతని స్నేహితులు వీడియో తీశారు. అతని కదలికను పలుచని మంచు పొర కింద ట్రాక్ చేస్తుంది. కానీ అవతలివైపునకు వెళ్లే మార్గం కనిపించికపోవడంతో వారి ప్లాన్ తిరగబడింది. ఈ చిన్న క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.34 లైక్‌లు, టిక్‌టాక్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసకపోతోంది. ఈ స్టంట్ స్లోవేకియాలో చిత్రీకరించారు. బోరిస్ సోషల్ మీడియా అతను బాల్ హాకీలో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్, రెడ్ బుల్ ఐస్ క్రాస్ అథ్లెట్, క్రాస్-ఫిట్ అథ్లెట్‌గా రాణించాడు.

Also Read: Watch Video: 18 బంతుల్లో 50 పరుగులు.. మెగా వేలానికి ముందు దుమ్ము రేపిన రోహిత్-విరాట్‌ల మాజీ స్నేహితుడు..!

Dosa For Just Re1: రూపాయికే దోసె.. సేవ చేస్తున్న సావిత్రమ్మా.. నువ్వు శభాషమ్మ..! వైరల్ అవుతున్న వీడియో..