Watch Video: స్క్రాప్‌తో వెరైటీ వెహికిల్.. ముగ్ధుడైన ఆనంద్ మహేంద్ర.. ఏం గిఫ్టిచ్చాడో తెలుసా?

|

Dec 23, 2021 | 9:05 AM

Viral Video:మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ మెటీరియల్‌తో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు. ఈ విశిష్ట సృష్టి మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది.

Watch Video: స్క్రాప్‌తో వెరైటీ వెహికిల్.. ముగ్ధుడైన ఆనంద్ మహేంద్ర.. ఏం గిఫ్టిచ్చాడో తెలుసా?
Anand Mahindra Tweet On Viral Video
Follow us on

Anand Mahindra: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ మెటీరియల్‌తో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు. ఈ అద్భుత సృష్టి మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది. యూట్యూబ్ ఛానెల్ హిస్టోరికానో ప్రకారం, స్క్రాప్ వస్తువులతో జీప్ తయారు చేసిన ఈ వ్యక్తి పేరు దత్తాత్రేయ లోహర్. అతను ఎక్కువగా చదువుకోలేదు. తన కుమారుడి కోరికను తీర్చేందుకు ఆయన ఈ విశిష్ట వాహనాన్ని రూపొందించారు.

జీప్ లాగా కనిపించే ఈ వాహనం కిక్-స్టార్ట్ సిస్టమ్‌ను కలిగిఉంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దానికి బదులుగా బొలెరోను కూడా వారికి అందిస్తానంటూ ప్రకటించాడు. ఈ జీప్ ఫ్రంట్ గ్రిల్ కూడా మహీంద్రా జీప్‌ను తలపిస్తుండడం విశేషం.

ఈ 45 సెకన్ల వీడియోను పంచుకుంటూ, ఆనంద్ మహీంద్రా ఇలా రాసుకొచ్చాడు.. “ఇది స్పష్టంగా ఏ నియమాలకు సరిపోలలేదు. కానీ, భారత ప్రజల సామర్థ్యాలను మెచ్చుకోవడం నేను ఎప్పటికీ ఆపను. అతనికి ప్రయాణం పట్ల మక్కువ ఉంది” అలాగే జీప్ ఫ్రంట్ గ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరో ట్వీట్‌లో, “ఈ వాహనం నిబంధనలను ఉల్లంఘించినందున స్థానిక అధికారులు ఈ వాహనాన్ని నిషేధించారు. నేను వ్యక్తిగతంగా వారికి బొలెరోను అందిస్తాను. మాకు స్ఫూర్తినిచ్చేందుకు వారి అద్భుత సృష్టిని Mahindra Research Valleyలో ప్రదర్శించవచ్చు, ఎందుకంటే తక్కువ వనరులతో చాలా అద్భుతాలు చేయడం అంటే ఇదే” అంటూ పేర్కొన్నాడు.

మహారాష్ట్రలోని దేవరాష్ట్ర గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ రూ.60,000 వెచ్చించి ఈ విశిష్ట వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనం మోటర్ బైక్ లాగా కిక్ తో స్టార్ట్ అవుతుంది. ఈ జీపులో మోటార్ సైకిల్ ఇంజన్ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దత్తాత్రేయ లోహర్‌ అద్భుతానికి నెటిజన్లు పిధా అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోకి 22 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీన్ని 3 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు.

Also Read: Viral Video: బ్యాండ్‌ బాజాలు, డీజే చప్పుళ్లు.. ఇవన్నీ స్మార్ట్‌ ఫోన్‌ ఊరేగింపు కోసం అంటే నమ్ముతారా.?

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..