మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా ?

Updated on: Jan 13, 2026 | 1:11 PM

విశాఖలో జువెలరీ షాపులకు దొంగల బెడద పట్టుకుంది. మహిళా దొంగల ముఠాలు విశాఖలో దిగి హల్చల్ చేస్తున్నాయి. జువెలరీ షాపుల్లోకి చొరబడి నగలు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. దొంగల ముఠాల సభ్యులు..షాపులకు కస్టమర్లలా వెళ్లి మాటలు కలిపి అవకాశం కోసం ఎదురు చూడటం, ఆపై మెల్లగా అందినకాడికి నగలు నొక్కేసి వాటిని మాయం చేయటం చేస్తున్నారు. గాజువాక లోని బీసీ రోడ్‌లో ముగ్గురు సభ్యుల దొంగల ముఠా ఓ జ్యువెలరీ షాపును టార్గెట్ చేసింది. నాగమణి, జ్ఞానమ్మ, పద్మ ఓం జ్యువెలరీ షాప్ లోకి వెళ్లారు. కస్టమర్లలా వెళ్లి.. చెవిరింగులు, జూకాలు చూపించాలని కోరారు. నిజమైన కస్టమర్స్ అనుకుని షాపు సిబ్బంది వాళ్ల ముందు వేర్వేరు రకాల మోడల్స్ చెవి రింగులు, జూకాలు పెట్టారు.

కాసేపు అటు ఇటు కదిపిన ఆ ముగ్గురు మహిళలు.. సేల్స్‌మెన్‌ ను మాటల్లో పెట్టి మస్కా కొట్టి.. కొన్ని వస్తువులను మాయం చేశారు. అయితే.. ఆ సేల్స్‌మన్‌‌కు ఎందుకో వీరి తీరుపై అనుమానం వచ్చి.. వారు షాపులో నుంచి బయలుదేరుతుండగా వారిని అడ్డుకున్నారు. తమను బయటకెళ్లకుండా నిలువరించేసరికి ఆ ముగ్గురు మహిళలు ఆగ్రహంతో తెగ రెచ్చిపోయారు. తాము దొంగలం కాదంటూ దబాయించే ప్రయత్నం చేశారు. ఈ లోపు షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించారు. అప్పటికీ వారు అమాయకులమే అని దబాయించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తనిఖీలు ప్రారంభించేసరికి వారిలో ఓ మహిళ టక్కున తలకొప్పులో రింగులను దాచి పెట్టింది. ఆమెను తనిఖీ చేసేసరికి ఒక్కొక్కటిగా ఆభరణాలు తల నుంచి బయటపడ్డాయి. నాలుగున్నర గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి చోరీ స్టైల్ దాచే తీరును చూసి పోలీసులే అవాక్కయ్యారు. ముగ్గురు మహిళలను విజయవాడకు చెందిన పాత నేరస్థులుగా గుర్తించారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం