ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
పర్యావరణానికి పెనుసవాలుగా మారిన ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. కొన్ని రకాల గొంగళి పురుగులు ప్లాస్టిక్‌ను తినగలవని, దానిని విచ్ఛిన్నం చేసి తమ శరీరంలో కొవ్వుగా మార్చుకోగలవని కనుగొన్నారు. కెనడాలోని బ్రాండన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
బ్రాండన్ యూనివర్సిటీలోని బయాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బ్రయాన్ కసోన్ నేతృత్వంలోని బృందం ‘మైనపు చిమ్మట గొంగళి పురుగుల’ పై ఈ పరిశోధన నిర్వహించింది. కేవలం 2000 మైనపు పురుగులు ఒక సాధారణ పాలిథిన్ కవర్‌ను 24 గంటల్లోనే పూర్తిగా విచ్ఛిన్నం చేయగలవని వారి అధ్యయనంలో తేలింది. ఈ పురుగులు పాలిథిన్‌ను జీర్ణం చేసుకుని, దానిని లిపిడ్ల రూపంలోకి మార్చి శరీర కొవ్వుగా నిల్వ చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. “మనం అధికంగా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు అవి శక్తిగా మారకుండా శరీరంలో ఎలా పేరుకుపోతాయో, ఈ పురుగులు కూడా ప్లాస్టిక్‌ను అదే విధంగా కొవ్వుగా మార్చుకుంటున్నాయి” అని డాక్టర్ కసోన్ వివరించారు.బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లో మంగళవారం జరిగిన ఓ సైన్స్ సదస్సులో ఈ పరిశోధన వివరాలను సమర్పించారు. ఈ జీవ ప్రక్రియ వెనుక ఉన్న యంత్రాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు వినూత్న పరిష్కారాలు కనుగొనవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో