ఏటీఎం చోరీకి విఫలయత్నం..చివరికి..వీడియో
ఏటీఎం కార్డులతో అమాయకులను మోసం చేసి దోచుకునేవారు కొందరైతే.. ఏకంగా ఏటీఎంనే లూటీచేసేవారు మరికొందరు. తాజాగా ఓ వ్యక్తి ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది.
మంగళవారం అర్థరాత్రి బళ్లారిలోని కలమ్మ సర్కిల్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ఒక వ్యక్తి పగులగొట్టాడు. అందులో ఉన్న క్యాష్ బాక్స్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసింది. దీంతో రాత్రి వేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ మల్లికార్జున వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఏటీఎం చోరీకి పాల్పడిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీస్ అధికారిపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కాసేపు పెనుగులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన అలెర్ట్ చేశారు. చివరకు ఆ దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నివసించే వెంకటేష్‌గా గుర్తించారు. ఇదంతా ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఐశ్వర్యారాయ్ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో
సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో
ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

