Telanagana: బిడ్డ కోసం ఓ తండ్రి ధర్నా..! అత్తారింటిముందు తండ్రి ధర్నా బైఠాయింపు వీడియో..
సాధారణంగా మహిళలు అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేకో, భర్త ఆగడాలు భరించలేకో ధర్నాలు, నిరసనలు చేయడం మనం చూశాం. ఇక్కడ ఓ అల్లుడు తన అత్తారింటిముందు తన తల్లిదండ్రులతో సహా ధర్నాకు దిగాడు.
సాధారణంగా మహిళలు అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేకో, భర్త ఆగడాలు భరించలేకో ధర్నాలు, నిరసనలు చేయడం మనం చూశాం. ఇక్కడ ఓ అల్లుడు తన అత్తారింటిముందు తన తల్లిదండ్రులతో సహా ధర్నాకు దిగాడు. ఇంటిముందు టెంటేసుకుని కూర్చున్నాడు. ఈ వినూత్న ఘటన తెలంగాణాలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడికి కోదాడకు చెందిన రమణికి 2018లో వివాహం జరిగింది. మూడేళ్లు వీరి కాపురం సాజవుగానే సాగింది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత భార్యభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్తను వదిలి రమణి బాబుతో సహా తన పుట్టింటికి వచ్చేసింది. బాబును తన తల్లిదండ్రుల వద్ద వదిలి రమణి కెనడాకు వెళ్లింది. దాంతో రమణి భర్త తన బాబుకోసం కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. వారానికోసారి ప్రవీణ్ తన బిడ్డను చూసుకోవచ్చని 9 నెలల క్రితం కోర్టు తీర్పునిచ్చింది. కానీ రమణి తల్లిదండ్రులు బాబును చూపించడంలేదు. దాంతో ప్రవీణ్ తన తల్లిదండ్రులతో కలిసి అత్తారింటిముందు నిరసనకు దిగాడు. తన కొడుకును తనకు చూపించాలంటూ బాబుపై తనకున్న ప్రేమను ప్రతిబింబిస్తూ ఓ భారీ కటౌట్‌ను కూడా ప్రదర్శించాడు. తన బాబు కోసం కొన్న బొమ్మలన్నీ ముందేసుకుని ఆందోళన చేపట్టాడు. కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా తమ మనవడ్ని తమకు దూరం చేస్తున్నారని ప్రవీణ్ తల్లిదండ్రులు వాపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..