Little Girl Makeup: చిట్టి బ్యూటిషన్‌కు అందరూ ఫిదా..! అమ్మను అందంగా రెడీ చేసిన చిన్నారి.. ఫన్నీ వీడియో.
లిప్‌స్టిక్ పెట్టుకోవడం అంటే చాలా మంది మగువలకు ఇష్టం. లిప్‌స్టిక్‌ని పెదవులకే కదా వేసుకుంటారు..? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోకండి.స్త్రీలకు ఎంతో ఇష్టమైన లిప్‌స్టిక్‌ని మేకప్‌లాగా ముఖం నిండా రుద్దేసింది ఓ చిన్నారి.
లిప్‌స్టిక్ పెట్టుకోవడం అంటే చాలా మంది మగువలకు ఇష్టం. లిప్‌స్టిక్‌ని పెదవులకే కదా వేసుకుంటారు..? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకోకండి. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే మీకూ ఈ సందేహమే కలుగుతుంది. అవును, స్త్రీలకు ఎంతో ఇష్టమైన లిప్‌స్టిక్‌ని మేకప్‌లాగా ముఖం నిండా రుద్దేసింది ఓ చిన్నారి. అంతేనా తన కంటే ముందు తన తల్లి ముఖాన్ని కూడా ఆ లిప్‌స్టిక్‌తో అలంకరించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేయడంతో అది కాస్త ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ మహిళ తన ఫేస్ మీద ఉన్న లిప్‌స్టిక్ మేకప్‌ని చూపించింది. ఇది ఎవరు చేసిన ఘనకార్యమో చూపిస్తా రండి అన్నట్టుగా సైగ చేసి తన చిన్నారి కూతురు దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆ చిన్నారి కూడా తన ముఖానికి లిప్‌స్టిక్‌తో మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఈ వీడియో తమకు చాలా నచ్చిందని, తమ పిల్లలు కూడా ఇలాగే చేస్తారంటూ.. నెటిజన్లు రకరకాల ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..