విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
స్పెయిన్‌లో విమానంలో గందరగోళం నెలకొనడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. టేకాఫ్ అవుతున్న విమానంలో పొరబాటున ఫైర్ అలారం మోగడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు విమానం రెక్కల మీదుగా రన్ వే మీదికి దూకేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
స్పెయిన్‌లోని పాల్మా డె మేయర్క్ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్‌కు ర్యాన్‌ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. మరో నిమిషంలో విమానం టేకాఫ్ అవుతుంది అనగా.. ఒక్కసారిగా ఫైర్ అలారం మోగింది. దీంతో, ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. దీంతో, విమానాశ్రయంలోని అగ్నిమాపక, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి.. అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులను బయటకు తరలించే ప్రక్రియను చేపట్టారు. అయితే, కొంతమంది ప్రయాణికులు సిబ్బంది సూచనలను వినిపించుకోకుండా, భయంతో విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకేశారు. ఈ క్రమంలో దాదాపు 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై విమానయాన సంస్థ జరిపిన దర్యాప్తులో.. ఒక టెక్నికల్ సమస్య వల్ల పొరబాటున ఆ అలారం మోగినట్లు గుర్తించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో
సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో
సునామీ మేఘాన్ని చూసారా వీడియో
గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో