నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

Updated on: Feb 14, 2025 | 8:43 PM

అందమైన చీరకట్టు, నుదుట కుంకుమ బొట్టు, చేతికి గాజులు, తలనిండా పూలు... సాంప్రదాయ కట్టుబొట్టుతో కనిపించే వీళ్లంతా మగవాళ్లే అంటే క్షణకాలం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక గుడిలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కోసం ఆ విధంగా తయారయ్యారు. ఇంతకీ ఏమిటా గుడి? ఏమా కథ?? చమయవిళక్కు ఉత్సవం... కేరళలోని కొల్లాం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతీ ఏటా ఘనంగా జరుగుతుంది. మార్చి నెలలో దాదాపు 19 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాంప్రదాయ ఆచారంలో భాగంగా చివరి రెండు రోజుల్లో పురుషులు చీరలు, లంగావోణీలు ధరించి, ధగధగ మెరిసే ఆభరణాలతో అందంగా అలంకరించుకొని పాల్గొంటారు.

కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాలకు చెందిన పురుషులు చేతిలో దీపాలు పట్టుకొని, సాంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్తారు.పురుషులు స్త్రీ వేషధారణతో అమ్మవారి రథాన్ని పూలతో సిద్ధం చేసి, తర్వాత ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ విధంగా మహిళల్లా అలంకరించుకొని, పూజలు చేస్తే అమ్మవారు సంతోషించి, కోరిన కోర్కెలు తీరుస్తుందనేది భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో భాగంగా పగటిపూట పదేళ్లలోపు వయసున్న అబ్బాయిలందరూ అమ్మాయిల మాదిరిగా ముస్తాబై దీపారాధనలో పాల్గొంటారు. ప్రధానఘట్టం మాత్రం సాయంత్రం ప్రారంభమై తెల్లవారుజాము దాకా కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

మరిన్ని వీడియోల కోసం :

స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..

భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో

అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో

ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…

భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో