చిరుతకే ఝలక్‌ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో

Updated on: Jun 23, 2025 | 12:14 PM

ఆహారం, నీటి కోసం వెతుక్కుంటూ వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతున్న ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. ఎక్కువగా చిరుతపులులు గ్రామీణ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. చిరుతపులుల ప్రధాన ఆహారం అడవి పందులు. అడవుల్లో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో వీటికి ఆహర కొరత ఏర్పడింది. వీటి తర్వాత చిరుతలు ప్రధానంగా తినే ఆహారం కుక్కలు. అందుకే ఇవి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా ఓ చిరుత పులి కుక్కను వేటాడేందుకు వచ్చింది. అయితే ఎంతో చాకచక్యంగా ఆ శునకం చిరుతబారినుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో పోలీస్ లైన్‌లో ఉన్న క్వార్టర్ గార్డ్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. వీడియోలో… ఓ వీధిలో రాత్రివేళ ఓ చెట్టుకిం శునకం పడుకొని ఉంది. ఇంతలో ఓ చిరుత అటుగా వేటకు వచ్చింది. దూరంనుంచే చిరుతను గమనించిన శునకం వెంటనే అలర్టయింది. చిరుత తనను చేరేలోపు వాయువేగంతో అక్కడినుంచి ఇంట్లోకి పరుగెత్తింది. ఊహించని ఈ పరిణామానికి చిరుత బిత్తరపోయింది. ఆ శునకం చిరుతను గమనించేందుకు మరోసారి కాస్త ముందుకు వచ్చింది. చిరుత అక్కడే ఉంది.. దాంతో శునకం లోపలికి వెళ్లిపోయింది. చిరుత దానిని అనుసరించేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడ లైట్లు ఆన్‌ చేసి ఉండటంతో వెలుతురు బాగా ఉంది. బహుశా అందుకేనేమో రిస్క్‌ ఎందుకనుకుందో ఏమో చిరుత వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీ పుటేజీలో రికార్డయింది. ఈ వీడియోను అల్మోరా పోలీసులు తమ సోషల్‌ మీడియా ఖాతా ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ ఘటనతో పోలీస్‌ లైన్‌ అల్మోరాలోని క్వార్డర్‌ గార్డ్‌ ప్రాంగణంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు స్థానికులను అలర్ట్‌ చేశారు. రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

పాముకు ముద్దుపెట్టిన రైతు.. చివరకు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో