దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత వీడియో
ఏ జీవికైనా తల్లి ఒక భరోసా.. ఒక ధైర్యం.. ప్రతి బిడ్డకు అమ్మ ఓ రక్షణ కవచం.. తల్లి సంరక్షణలో ఉన్న ఏ బిడ్డ అయినా ఎంతో సురక్షితంగా ఫీలవుతుంది. అదే అమ్మ ఒక్క క్షణం కనిపించకపోతే బిడ్డ తల్లడిల్లిపోతుంది. ఎంతమంది చేరదీసినా అమ్మ కనిపించేంతవరకూ ఆ చిట్టి మనసు కుదుటపడదు. ఎందుకంటే తన బిడ్డకోసం తల్లి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటుంది.. చివరికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డను రక్షించుకుంటుంది.
అందుకే అమ్మను దైవంతో సమానం అని చెప్పారు పెద్దలు. ఇది మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు సైతం వర్తిస్తుంది. తాజాగా తల్లికి దూరమై తల్లడిల్లిపోయిన ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలో తనతల్లితోపాటు వెళ్తున్న గున్నేనుగు పొరబాటున తప్పిపోయి రోడ్డుమీదకు వచ్చేసింది. తన తల్లి కనిపించక.. రోడ్డుమీద పరుగులు పెడుతూ.. వచ్చే.. పోయే.. వాహనాల శబ్ధాలకు భయపడుతూ.. తన తల్లి ఎటెళ్లిందో తెలియక, తను ఎటువెళ్లాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పరుగులు పెడుతున్న గున్న ఏనుగు అటవీశాఖ అధికారుల కంటపడింది. గున్న ఏనుగు పరిస్థితిని అర్ధం చేసుకున్న అటవీ అధికారులు ఆ చిట్టి ఏనుగును తన తల్లివద్దకు చేర్చే ప్రయత్నం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో
ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో
అడవిలో కొత్త జంట హనీమూన్.. ఊహించని అతిథుల హల్‌చల్ వీడియో