కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

Updated on: Jan 11, 2026 | 9:15 AM

వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ అమెరికాలో మరణించారు. పుత్రశోకంలో ఉన్నప్పటికీ, అనిల్ అగర్వాల్ తన సంపాదనలో 75% సమాజ సేవకు కేటాయిస్తానని గతంలో చేసిన వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. బిడ్డల ఆకలి, మహిళల స్వశక్తి, యువత ఉపాధి కోసం తన కుమారుడు కలలు కన్న ఆశయాలను నెరవేరుస్తానని భావోద్వేగంగా ప్రకటించారు. ఇది ఆయన దాతృత్వ సంకల్పాన్ని చాటుతుంది.

వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా ఉన్న వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్‌ అగర్వాల్‌ పుత్రశోకంలో తన సంపాదనలో 75 శాతం సమాజ సేవకు కేటాయిస్తానని గతంలో చేసిన వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. వేదాంత చైర్మన్‌ అనిల్ అగర్వాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు 49 ఏళ్ళ అగ్నివేశ్ అగర్వాల్ అమెరికాలో మృతి చెందారు. అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. కుమారుడి మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన అనిల్ అగర్వాల్, ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. తన కొడుకు అగ్ని త్వరగా తమను విడిచి వెళ్ళిపోయాడనీ తను స్నేహితుడిలా ఉండేవాడనీ రాసుకొచ్చారు. తమ సంపాదనలో 75 శాతం సమాజానికి ఇస్తానని వాగ్దానం చేశాననీ ఆ మాటను ఈరోజు మరోసారి పునరుద్ఘాటిస్తున్నాననీ అన్నారు. కుమారుడు లేకుండా ఈ మార్గంలో ఎలా నడవాలో తనకు తెలియడం లేదనీ కానీ అతని ఆలోచనలను ముందుకు తీసుకెళతాననీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బిడ్డా ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి మహిళ స్వశక్తితో నిలబడాలని, యువతకు ఉపాధి లభించాలని తామిద్దరం కలలు కన్నామని, ఆ కలను నెరవేరుస్తానని అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. మరణించిన అగ్నివేశ్, వేదాంత అనుబంధ సంస్థ సోబో పవర్ కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. సుమారు రూ. 27,000 కోట్ల సంపద కలిగిన అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తో పాటు కుమార్తె ప్రియా అగర్వాల్ కూడా ఉన్నారు. అగ్నివేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు అగర్వాల్ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కుమారుడిని కోల్పోయిన తీవ్ర దుఃఖంలోనూ తన దాతృత్వ సంకల్పాన్ని అనిల్ అగర్వాల్ బయటపెట్టడం మెచ్చుకోదగిందని పలువురు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్