నదిలో కొట్టుకు పోతున్న యువకుడు.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు.

నదిలో కొట్టుకు పోతున్న యువకుడు.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు.

Phani CH

|

Updated on: Jul 18, 2022 | 9:36 PM

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు, పట్టణాలు జగదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు, పట్టణాలు జగదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. పంటలు నీట మునిగాయి.. పలువురు ప్రమాద వశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నది ప్రవాహంలో ఈదలేక కొట్టుకున్న పోతున్న యువకుడిని ప్రాణాలకు తెగించి మరీ పోలీసులు కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు .. వేగంగా ప్రవహిస్తోన్న నదిలో చిక్కుకున్నాడు. ఒడ్డుకు చేరుకోవడానికి కష్టపడుతున్నాడు. అయితే ఒక పోలీసు అధికారి నదిలో చిక్కుకున్న యువకుడి వైపు వేగంగా ఈదుతూ కనిపించారు. అధికారి నది ప్రవాహంలో కొట్టుకుని పోతున్న వ్యక్తిని పట్టుకున్నాడు.. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు నదిలో దూకి.. వేగంగా ఈదుకుంటూ.. ఆ ఇద్దరి దగ్గరకు చేరుకున్నారు. చివరకు నదిలో కొట్టుకుని పోతున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ కాంగ్రా ఘాట్‌లోని రావత్‌పూర్ భవన్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడిని కాపాడిన ఇద్దరు అధికారులు అతుల్ సింగ్, సన్నీ కుమార్‌లుగా గుర్తించారు. ఈ రెస్క్యూ వీడియోను షేర్ చేసిన పోలీస్ అధికారులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్‌లు, రీట్వీట్‌లతో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పోలీసులు హీరోగా మారడం అంటే ఇదే! మీ ఇమేజ్‌ని కొనసాగించండి” అని కొందరు, పోలీసుల సాహసం అద్భుతం. ఇద్దరూ అవార్డుకు అర్హులని మరికొందరు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే

భారీ కొండ చిలువలతో మసాజ్‌.. మసాజ్‌ సెంటర్లకు యువతులు క్యూ

Viral: ఓరి దేవుడో !! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింతజీవి దాడి

ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే

చిన్నారి అద్భుత ట్యాలెంట్‌.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం

 

Published on: Jul 18, 2022 08:57 PM