పాడుబడ్డ బావిలో ఆరు పాములు !! స్నేక్‌ క్యాచర్‌ టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్

|

Aug 29, 2022 | 8:42 PM

తాజాగా పాములకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. స్నేక్‌ క్యాచర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే .. ఉత్తరప్రదేశ్‌ అంబేడ్కర్ నగర్ జిల్లాలోని గ్రామానికి స్నేక్‌ క్యాచర్‌ వెళ్లాడు.

తాజాగా పాములకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. స్నేక్‌ క్యాచర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే .. ఉత్తరప్రదేశ్‌ అంబేడ్కర్ నగర్ జిల్లాలోని గ్రామానికి స్నేక్‌ క్యాచర్‌ వెళ్లాడు. అక్కడి పంట పొలాల మధ్యలో ఓ పాడుబడిన బావిలో చాలాకాలంగా ఆరు విషపూరిత పాములు ఉంటున్నాయి. దీంతో గ్రామస్తులందరూ బావి దగ్గరకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఆ బావి మధ్యలో ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. ఏదైనా అనర్థం జరిగితే వెంటనే పైకి రావడం చాలా కష్టం. అయితే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వెనకడుగు వేయక నిచ్చెన సాయంతో మురళి బావిలోకి దిగాడు. లోపలికెళ్లాక బావి చుట్టూ అక్కడక్కడా మొత్తం ఆరు పాములు కనిపించాయి. ఇందులో రెండు కింగ్ కోబ్రాలు, రెండు రక్త పింజర, మరో రెండు ఇతర విషపూరిత పాములు ఉన్నాయి. తన దగ్గరున్న స్నేక్ క్యాచింగ్ స్టిక్ సాయంతో పని మొదలెట్టిన మురళి ఒక్కో పామును చాకచక్యంగా పట్టేశాడు. ఆపై వాటిని సంచుల్లో బాధించాడు. కొన్ని పాములను చేతితో గట్టిగా తల వద్ద పట్టుకుని గ్రామస్తులకు చూపించాడు. అలా మొత్తం ఆరు పాములను సంచుల్లో బంధించాడు. ఆపై నిచ్చెన సహాయంతో పైకి వచ్చాడు. ఇలా ఎంతో నేర్పరితనంతో మురళీ పాములు పట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు అతని ధైర్యాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగస్ట్‌ 23, 1966 ..చంద్రుడి ఉపరితలం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు !!

ఎవరికో వచ్చిన ఆర్డర్‌ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి !!

టీవీలో వస్తున్న వీడియోను చూస్తూ.. ఈ కుక్క ఏం చేసిందో తెలుసా !!

Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??

అలియా వేసుకున్న ఈ డ్రస్‌ కాస్ట్‌ ఎంతో తెలిస్తే.. నిజంగా షాకవుతారు !!

 

Published on: Aug 29, 2022 08:42 PM