విమానం క్యూట్‌గా ఉందనా ?? లేక ప్రయాణికులు అందంగా ఉన్నారనా ??

|

Aug 23, 2024 | 10:01 PM

ఇండిగో టికెట్‌ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్‌ ఛార్జీలతో పాటు క్యూట్‌ ఫీజు, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు అంటూ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్‌సింగ్‌ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్ చేస్తూ ఇండిగోపై ప్రశ్నల వర్షం కురిపించాడు. పోస్ట్‌లో క్యూట్‌ ఛార్జ్‌ కింద రూ.50, ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు కింద రూ.236, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు కింద రూ.1,003 ఎయిర్‌లైన్‌ వసూలు చేసినట్లుగా ఉంది.

ఇండిగో టికెట్‌ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్‌ ఛార్జీలతో పాటు క్యూట్‌ ఫీజు, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు అంటూ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్‌సింగ్‌ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్ చేస్తూ ఇండిగోపై ప్రశ్నల వర్షం కురిపించాడు. పోస్ట్‌లో క్యూట్‌ ఛార్జ్‌ కింద రూ.50, ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు కింద రూ.236, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు కింద రూ.1,003 ఎయిర్‌లైన్‌ వసూలు చేసినట్లుగా ఉంది. దీన్ని షేర్‌ చేస్తూ.. “ఏంటీ క్యూట్‌ ఫీజు? యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా? లేదా మీ విమానాలు క్యూట్‌గా ఉన్నాయని భావిస్తూ దానికి ఛార్జీ తీసుకుంటున్నారా? ఏంటీ యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు? మీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను మీరు ఏవిధంగా డెవలప్‌ చేస్తారు? ఏంటీ ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు? ప్రయాణాల్లో నా భద్రత కోసం ప్రభుత్వానికి నేను పన్నులు కట్టట్లేదా? లేదా విమానాల్లో భద్రత కోసం పౌరవిమానయాన శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఏమైనా ఇచ్చిందా?’’ అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే 20లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పని మనిషిలా వస్తుంది.. ఇల్లంతా దోచేస్తుంది

క్యాంప్‌ పేరుతో మైనర్ బాలికలపై లైంగిక దాడి

Follow us on