ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి.. అవయవాలను అమ్మేసింది !!

|

May 08, 2023 | 9:56 AM

అమెరికాలోని ఓ మార్చురీలో పని చేసే మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మరో వ్యక్తితో కుమ్మక్కై మృతుల గుండె, మెదడు, జననేంద్రియాలు, కళ్లు ఇలా వివిధ అవయవాలను ఆన్‌లైన్‌లోనే అతడికి అమ్మేసింది. మొత్తం 20 బాక్సుల అవయవాలను విక్రయించినట్లు పోలీసులు ఆమెపై అభియోగాలు మోపారు.

అమెరికాలోని ఓ మార్చురీలో పని చేసే మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మరో వ్యక్తితో కుమ్మక్కై మృతుల గుండె, మెదడు, జననేంద్రియాలు, కళ్లు ఇలా వివిధ అవయవాలను ఆన్‌లైన్‌లోనే అతడికి అమ్మేసింది. మొత్తం 20 బాక్సుల అవయవాలను విక్రయించినట్లు పోలీసులు ఆమెపై అభియోగాలు మోపారు. వివరాల్లోకి వెళ్తే.. అర్కన్సాస్‌కు చెందిన కెన్‌డేస్‌ చాంప్‌మన్‌ స్కాట్‌ అనే మహిళ స్థానికంగా ఓ మార్చురీలో పని చేస్తోంది. మృతదేహాలను రవాణా చేయడం, వాటిని పూడ్చిపెట్టడం, అవసరమైతే వాటికి కొన్ని లేపనాలు పూసి భద్రపరచడం ఆమె పని. పనిలో లొసుగులు తెలుసుకున్న స్కాట్‌కు దుర్బుద్ధి పుట్టింది. ఈ క్రమంలోనే పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుంది. విధుల్లో భాగంగా స్థానిక మెడికల్‌ స్కూల్‌ నుంచి అవయవాలను సేకరించి.. వాటిని గుట్టుచప్పుడు కాకుండా స్కాట్‌ ఆన్‌లైన్‌లోనే అతడికి అమ్మేసేది. ఇలా దాదాపు 11,000 డాలర్లను అతడి నుంచి వసూలు చేసింది.ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏప్రిల్‌ 5న పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను కటకటాల్లోకి పంపారు. అవయవాల విక్రయం, ఆన్‌లైన్‌ మోసం, అంతర్‌రాష్ట్ర అక్రమ రవాణా తదితర 12 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికూతురి ముందు పరువు పాయె.. సిగ్గుపడ్డ పెళ్ళికొడుకు

ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. షాక్ అయ్యి షేక్ అయిన జనం

రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్

65 ఏండ్ల వ‌య‌సులో 16 ఏండ్ల యువ‌తిని పెళ్లి చేసుకున్న మేయ‌ర్

స్కర్టులు ధరించి మెట్రోలో సందడి.. జనం ఎలా స్పందించారంటే ??