US Pop singer Jake Flint: పెళ్లైన కొద్ది గంటలకే ప్రాణాలు విడిచిన ప్రముఖ సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..!
పెళ్లి చేసుకుని కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ప్రముఖ సింగర్ అంతలోనే అనంత లోకాలకు పయనమయ్యారు. అట్టహాసంగా విహవాం జరిగిన కొన్ని గంటలకే నిద్రలో ఉండగానే తుది శ్వాస విడిచాడు.
37 ఏళ్ల వయసులోనే సింగర్ జేక్ ఫ్లింట్ హఠాణ్మరణం చెందాడు. దీంతో నవ వధువుతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికా ఓక్లామాలో 1985లో జన్మించిన జేక్ ఫ్లింట్.. స్థానికంగా ఫేమస్ సింగర్. వాట్స్ యువర్ నేమ్, లాంగ్ రోడ్ బ్యాక్ హోం, కౌ టౌన్, ఫైర్ లైన్ వంటి హిట్ ఆల్బమ్స్‌తో జేక్ అమెరికాలో పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజాదరణ కలిగిన ఆల్బమ్స్‌తో మ్యూజిక్ ప్రియులను అలరించాడు. లైవ్ ఈవెంట్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. నవంబర్ 27న బ్రెండ్ విల్సన్‌తో జేక్ ఫ్లింట్ వివాహం ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే జేక్ మరణించాడు. ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. జేక్ మృతిని అతని స్నేహితుడు ప్రచారకర్త క్లిఫ్ డోయల్ ధృవీకరించారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..