Model: ఫ్రిజ్‌లో మోడల్ డెడ్‌బాడీ.. రెండు నెలల గర్భవతి అని తేల్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్.
అమెరికాలో లాస్ ఏంజెల్స్ పోలీసులు ఒక మోడల్ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో గుర్తించారు. ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. సెప్టెంబర్ 12న 31 ఏళ్ల మోడల్ మలీసా మూనీ, లాస్ ఏంజెల్స్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లోని ఫ్రిజ్‌లో శవమై కనిపించింది.
అమెరికాలో లాస్ ఏంజెల్స్ పోలీసులు ఒక మోడల్ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో గుర్తించారు. ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. సెప్టెంబర్ 12న 31 ఏళ్ల మోడల్ మలీసా మూనీ, లాస్ ఏంజెల్స్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లోని ఫ్రిజ్‌లో శవమై కనిపించింది. డ్రగ్స్, మద్యం మత్తులో ఉన్న ఆమెను కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి ఫ్రిజ్‌లో కుక్కిన ఆ మోడల్ తల, ముఖం, వీపు, చేతిపై గాయాలున్నట్లు చెప్పారు. మరణించిన మోడల్ మలీసాకు చెందిన ఐక్లౌడ్‌లో ఆమె పరికరాలను ఎవరో వినియోగిస్తున్నట్లు సూచించిన హెచ్చరిక తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడు ఆమె ఐఫోన్, మ్యాక్‌బుక్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. మరోవైపు మూనీ మరణించినప్పుడు అనుభవించిన బాధను తాను ఊహించలేనని ఆమె సోదరి, మోడల్ అయిన జోర్డిన్ పౌలిన్ ఆవేదనగా తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..